»   » చిరు 150: నోటి దూల ప్రదర్శింనందుకు క్షమాపణ, ఏం జరిగింది?

చిరు 150: నోటి దూల ప్రదర్శింనందుకు క్షమాపణ, ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి నుండి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో ఆ మధ్య వర్మ స్పందిస్తూ.... మెగా స్టార్ సినిమా అంటే 'బాహుబలి' లాంటి సినిమాలను సైతం తలదన్నేలా ఉండాలి. ఒక వేళ అలా లేకుంటే మెగాస్టార్ అనే పదానికి అర్థం ఉండదు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

చిరంజీవి 150వ సినిమాను డీల్ చేసే సత్తా రాజమౌళికి తప్ప మరొకరికి ఉండదనే నేను భావిస్తాను. చిరంజీవి 150వ సినిమాకు నేను దర్శకత్వం వహిస్తే అట్టర్ ప్లాప్ అవుతుంది అంటూ ఆ మధ్య రకరకాలుగా ఈ సినిమాపై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే.


అయితే నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరు 150 టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత వర్మ మాట మార్చాడు. అంతే కాదు క్షమాపణలు కూడా చెప్పాడు. స్లైడ్ షోలో వర్మ ఇంకా ఏం కామెంట్స్ చేసారు? అనే వివరాలు...


బ్లాక్ బస్టర్ ఖాయం

బ్లాక్ బస్టర్ ఖాయం

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్ అమేజింగ్ గా ఉంది, షూర్ బ్లాక్ బస్టర్ అంటూ వర్మ ట్వీట్ చేసారు.


రాక్స్

రాక్స్

మెగాస్టార్ చిరంజీవి ఎంటైర్ కెరీర్లోనే ఇది బెస్ట్ లుక్, ఖైదీ నెం.150 టైటిల్ రాక్స్ అంటూ వర్మ ట్వీట్ చేసారు.


క్షమాపణ

క్షమాపణ

గతంలో నేను చిరంజీవి 150వపై విమర్శలు చేసాను. అందుకు నేను అభిమానులకు ఇపుడు క్షమాపణలు చెబుతున్నాను అని వర్మ అన్నారు.


వర్మ అంచనాలు తప్పాయి

వర్మ అంచనాలు తప్పాయి

చిరంజీవి 150వ సినిమా లుక్ విషయంలో తన అంచనాలు తప్పడం వల్లనే ఆయన క్షమాపణలు చెప్పినట్లు స్పష్టం అవుతోంది.


వర్మతో పాటు

వర్మతో పాటు

వర్మ మాత్రమే కాదు... చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్ చూసిన వారంతా సూపర్బ్ అంటున్నారు.


ఖైదీ నెం.150

ఖైదీ నెం.150

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.


కాజల్

కాజల్

ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ఊహాగానాలయ్యాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే "ఖైదీ నెంబర్ 150'' అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపారు.


మోషన్ పోస్టర్

మోషన్ పోస్టర్

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.


ఎనర్జీ

ఎనర్జీ

షూటింగ్ ఆన్ లొకేషన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ స్టయిల్ గురించి ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఇదివరకే ఓ అప్డేట్ అందించారు. మెగాస్టార్ షూటింగ్లో ఎంతో ఎనర్జిటిక్గా చేస్తున్నారంటూ రత్నవేలు కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై ఫిలింనగర్లో చర్చ సాగుతోంది.


బాస్ ఈజ్ బ్యాక్

బాస్ ఈజ్ బ్యాక్

మెగా ఫ్యాన్స్లో ఒకటే హుషారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చిరు స్టెప్పేస్తే, చిరు చిందేస్తే ఎలా ఉంటుందో ముందు ముందు చూడబోతున్నాం. అన్నయ్యలో మునుపటి ఎనర్జీ రీలోడ్ అయ్యిందన్న చిత్రయూనిట్ టాక్ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.


వివి వినాయక్

వివి వినాయక్

ప్రతిష్ఠాత్మక 150వ సినిమాని స్టార్ డైరెక్టర్ వినాయక్ సరికొత్త పంథాలో తెరకెక్కిస్తున్నారన్నది చిత్రయూనిట్ మాట. చిరును మరో లెవల్లో ఆవిష్కరించేందుకు వినాయక్ అన్నివిధాలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు.


అన్ని అంశాలతో

అన్ని అంశాలతో

అందుకు తగ్గట్టే మునుపటి జోష్ ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ హుషారుగా షూటింగులో పాల్గొంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో, మన నేటివిటీకి తగ్గ కథాంశమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది.


స్పెషల్

స్పెషల్

150వ సినిమా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్గా ఉండబోతోంది. ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి చక్కని ట్యూన్స్ సిద్ధం చేశారు. శంకర్ దాదా సిరీస్లో పెప్పీ నంబర్స్కి ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమా సంగీతం ఉండబోతోంది.


రైతు సమస్యలపై

రైతు సమస్యలపై

ఈ కథలో చిరంజీవి గారి నుంచి ప్రేక్షకాభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. కామెడీ, మ్యూజిక్, ఫైట్స్, సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉంటాయి. సామాన్య రైతుల సమస్య గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవిగారు నటిస్తున్నారు అని వినాయక్ తెలిపారు.


అందరూ హ్యాపీ

అందరూ హ్యాపీ

ఈ కథని శ్రేయోభిలాషులందరికీ వినిపించడం జరిగింది. అలాగే చిరంజీవి గారితో పాటు నిర్మాత రామ్ చరణ్, ఫ్యామిలీ సభ్యులందరూ విని ఆనందించారు. వారందరూ ఒకే మాటగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. చిరంజీవి గారు, నేను ఎంత ఆనందంగా ఉన్నామో అంతే ఆనందంగా వారందరూ ఉన్నారు. ప్రేక్షకులు, అభిమానులు కూడా ఆనందించేలా ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు.


వరుణ్ ఏడ్చిన రోజు, సొంత నిర్మాణంపై చెర్రీ

వరుణ్ ఏడ్చిన రోజు, సొంత నిర్మాణంపై చెర్రీ

పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


English summary
"After seeing this look i want to apologise to all his fans for whatever criticism I made in the past on his 150th" RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu