»   » మంత్రి పదవే లక్ష్యంగా ఉదయభాను! కేసీఆర్, బాబులపై..

మంత్రి పదవే లక్ష్యంగా ఉదయభాను! కేసీఆర్, బాబులపై..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏంటి? ఇంకా యాంకర్ ఉదయభాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేనేలేదు అప్పుడే మంత్రి పదవి ఏమిటా? అని ఆలోచిస్తున్నారు. మీరు విన్నది నిజమే....అయితే ఆమె మంత్రి పదవి విషయం డైరెక్టుగా చెప్పలేదు కానీ, ఇండైరెక్టుగా వెల్లడించింది. భవిష్యత్‌లో మంత్రి స్థాయికి ఎదుగుతానని, ఎప్పటికైనా మంత్రి పదవి చేపడతాననే భావం ఆమె వ్యాఖ్యల్లో వ్యక్తమైంది.

టీవీ నటి స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన స్మృతి ఇరానీ తన రోల్ మోడల్ అని ఉదయభాను అంటోంది. 'ఎప్పటికైనా తాను ఆమె స్థాయికి ఎదుగుతాను, ఇది నా మనసులోని కోరిక. ఇటీవల నేను కేసీఆర్ గారిని కలిసాను. ఆయన నా యాంకరింగ్ ఎంతో బాగుంటుందని మెచ్చుకున్నారు. ఆయన మెచ్చుకోవడం గౌరవంగా భావిస్తున్నాను' అని ఉదయభాను వ్యాఖ్యానించారు. అదే విధంగా చంద్రబాబుపై కూడా ప్రశంసలు కురిపించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

I want to become like Smriti Irani some day: Udaya Bhanu

పలు హిందీ సీరియల్స్‌లో నటించిన స్మృతి ఇరానీ బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత బీజేపీలో చేరింది. తన టాలెంటుతో బీజేపీలో కీలక నేతగా ఎదిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఇచ్చింది. ఆమె ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ...నరేంద్ర మోడీ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

బుల్లితెరపై పాపులారిటీ సంపాదించిన ఉదయభాను కూడా అదే తరహాలో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని, మంత్రి పదవి చేపట్టే స్థాయికి ఎదగాలనే ఆశతో ఉన్నట్లు ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆమె తన రాజకీయ బాటకు ఏ పార్టీని ఎంచుకుంటుంది? ప్రాంతీయ పార్టీలను ఎంచుకుంటుందా? లేక జాతీయ పార్టీలను ఎంచుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

English summary
"I want to become like Smriti Irani some day. In my heart, I aspire to be like her. Recently, when I met KCR, he said he liked my anchoring. It was a huge honour for me," Udaya Bhanu told media people while shooting at Studio.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu