»   » మరిచిపోలేదు: పవన్ కళ్యాణ్‌‌ గారు అంటూ మోడీ ట్వీట్

మరిచిపోలేదు: పవన్ కళ్యాణ్‌‌ గారు అంటూ మోడీ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారత ప్రధానికిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోడీ తన గెలుపుకు సహకరించిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సోషల్ నెట్వర్కింగులో యాక్టివ్‌గా మోడీ ఈ మేరకు ప్రచారంలో తనతో పాటు నడిచిన మద్దతు దారులకు థాంక్స్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తనకు సహరించిన వారిని ఎప్పటికీ మరిచిపోనని మరోసారి నిరూపించారు.

తెలుగునాట మెడీకి మద్దతుగా నిలిచిన వారిలో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఒకరు. భారీగా అభిమాన బలం ఉన్న పవన్ కళ్యాణ్.......ఇక్కడ మోడీ గాలి బలంగా వీయడంలో తన వంతు కృషి చేసారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు.

I want to express my gratitude to Pawan Kalyan: Modi

ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్ అంతటా జరిగిన ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని మాకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను' అంటూ మెడీ ట్వీట్ చేసారు.

అదే విధంగా నిన్న పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో స్పందిస్తూ...టిడిపి, బిజెపి విజయం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. టిడిపి, బిజెపి కూటమిని గెలిపించినందుకు ప్రజలందరికీ థ్యాంక్స్ అన్నారు. కాంగ్రెసు పార్టీ వ్యతిరేక ఓట్లు చీల్చవద్దనే తాను పోటీ చేయలేదని చెప్పారు. తనకు జగన్ పార్టీ పైన వ్యక్తిగత కోపమేమీ లేదన్నారు. అయితే వారి దోపిడీ చూస్తే చాలా బాధేసిందన్నారు. దోపీడీకి పాల్పడ్డ వారు ఇప్పటికైనా మారాని హితవు పలికారు.

English summary

 “I want to express my gratitude to Pawan Kalyan Garu for his enthusiasm & support through the campaign across Andhra Pradesh” tweeted Modi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu