»   » అందుకే ఫారెన్ లో సెటిల్ కావాలని కోరుకున్న శ్రీదేవి..ఇక్కడైతే ఆ అవకాశం ఉండదని!

అందుకే ఫారెన్ లో సెటిల్ కావాలని కోరుకున్న శ్రీదేవి..ఇక్కడైతే ఆ అవకాశం ఉండదని!

Subscribe to Filmibeat Telugu

అతిలోక సుందరి శ్రీదేవి మరణించినప్పటికీ ఆమె జ్ఞాపకాలు అభిమానులని వెంటాడుతూనే ఉంటాయి. శ్రీదేవి చలాకీతనం కలిగిన నటి. కానీ ఆమె ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అందుకే శ్రీదేవి ఇంటర్వ్యూ లు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. చలాకీతనం, చురుకుదనం ఆమె శరీరానికి మాత్రమే పరిమితం. ఏదైనా విషయాన్ని మాట్లాడే సందర్భంలో మాత్రం శ్రీదేవి ఆచి తూచి స్పందిస్తారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. శ్రీదేవి సినిమాల్లో నటించే సమయంలో తనకు విదేశాల్లో సెటిల్ కావాలని ఉందని, అందుకు శ్రీదేవి చెప్పిన సరదా కారణాన్ని ఆమె అభిమానులు నెమరువేసుకుంటున్నారు.

Boney Kapoor Finally Responds On Sridevi's Loss
శ్రీదేవికి నటనే అంతా

శ్రీదేవికి నటనే అంతా

బాల్యం నుంచే నటన ప్రారంభించిన శ్రీదేవికి అదే ప్రపంచంగా మారింది. తన పూర్తి స్థాయి సమయాన్ని నటనకే కేటాయించడంతో తక్కువసమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. శ్రీదేవి అందానికి, అభినయానికి దాసోహం కానీ చిత్ర పరిశ్రమ లేదు.

 మిగిలిన వ్యవహారాలన్నీ తల్లే

మిగిలిన వ్యవహారాలన్నీ తల్లే

శ్రీదేవి నటనపై మాత్రమే దృష్టి పెట్టేది. దర్శక నిర్మాతలతో చర్చించడం, పారితోషకం వంటి విషయాలన్నీ ఆమె తల్లి చూసుకునేవారని శ్రీదేవి సన్నిహితులు చెబుతుంటారు.

 చదువు కూడా ఇంట్లోనే

చదువు కూడా ఇంట్లోనే

బాల్యం నుంచే నటన మొదలు పెట్టడం వలన శ్రీదేవి చదువుపై దృష్టి పెట్టలేదని ఆమె బాబాయ్ ఇటీవల ఇంటర్వ్యూ లో వెల్లడించారు. విషయం పరిజ్ఞానానికి అవసరమైన విద్యని మాత్రం ఇంట్లోనే ఉపాధ్యాయుడి ద్వారా నేర్చుకున్నట్లు తెలుస్తోంది.

 మీడియాతో మాట్లాడడం చాలా అరుదు

మీడియాతో మాట్లాడడం చాలా అరుదు

శ్రీదేవి మీడియాతో మాట్లాడడం, ఇంటర్వ్యూ లు ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏ విషయాన్ని అయినా ఆమె కుటుంబ సభ్యులతోనే చర్చిస్తారు.

విదేశాలలో స్థిరపడాలని

విదేశాలలో స్థిరపడాలని

శ్రీదేవి సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినీకెరీర్ ముగించాక తాను విదేశాల్లో సెటిల్ కావాలని కోరుకుంటున్నట్లు శ్రీదేవి అప్పట్లో తెలిపారు.

 దానివెనుక సరదా కోరిక

దానివెనుక సరదా కోరిక

విదేశాల్లో తాను ఎందుకు సెటిల్ కావాలని కోరుకుంటున్నానో శ్రీదేవి సరదా కారణాన్ని తెలిపారు. తనకు ఐస్ క్రీం మరియు మిల్క్ షేక్స్ అంటే చాలా ఇష్టం అని, విదేశాల్లో అయితే వాటిని బాగా తినవచ్చు అని శ్రీదేవి తెలిపారు.

 ఇక్కడ ఆ అవకాశం దొరకడం లేదు

ఇక్కడ ఆ అవకాశం దొరకడం లేదు

ఇండియాలో కూడా ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ ఉన్నప్పటికీ సినిమాలతో బిజీగా ఉంటున్న కారణంగా వాటిని ఆస్వాదించే అవకాశం రావడం లేదని శ్రీదేవి నవ్వుతూ ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది.

English summary
An innocent Sridevi wanted to settle abroad so she could have ice-creams and milkshakes and watch movies
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu