For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటనరాని నీకు సినిమాలు ఎందుకు, ఫేస్ బుక్ లో ఎటాక్,హీరోయిన్ గోల

  By Srikanya
  |

  హైదరాబాద్ :తనను సినిమాలు మానేయమని, నీకు నటనరాదని చాలా మంది సోషల్ మీడియాలో ఎటాక్ చేసారని, ఇప్పటికి చేస్తున్నారని వాపోతోంది మంజిమ మోహన్. ఈ మంజిమ మోహన్ ఎవరూ అంటే..మరెవరో కాదు...ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చేస్తున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రం హీరోయిన్.

  ఆమె నటించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రం రిలీజ్ చిత్రం మళయాళంలో (ఇదే అల్లరి నరేష్ తో రీమేక్ చేస్తున్నారు) రిలీజ్ అయ్యాక తనపై సోషల్ మీడియాలో దారుణంగా దాడి చేసారని, ఆ కామెంట్స్, వ్యాఖ్యలు చదవటం చాలా బాధనిపించింది అంటోంది. ఈ సినిమాలో సెంటిమెంట్ సీక్వెల్ లో ఆమె నటన నవ్వు తెప్పించని ట్రోల్ చేసినవారి ఆరోపణ.

  ఈ రోజున ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాని మెయింటైన్ చేయటం చాలా కష్టమైపోతోందని , అవి ఎంతగా ఉపయోగపడుతున్నాయో అంతగా తమని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకుని వాపోయింది.

  సినిమాలో ఫలానా సన్నివేశంలో నువ్వు సరిగ్గా చేయలేదు..నీ ఫేస్ లో ఎక్సప్రెషన్స్ పలకలేదు అంటే తను ఏం చేస్తానని, అది డైరక్టర్ చూసుకుంటారని, ఆయన తృప్తి చెందాకే కదా...సినిమా బయిటకు వస్తుంది, అలాంటప్పుడు ఇలా తమ పై పడి ఎటాక్ చేయటం దారుణం అంటోంది. సోషల్ మీడియాలో ఉండేవాళ్లు ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే అయినా వాళ్ళు ఇలా బిహేవ్ చేయటం పద్దతి కాదని మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది.

  మరిన్ని విశేషాలు..ఆమె లేటెస్ట్ పిక్స్ తో ...

  ట్రోల్ చేసారు

  ట్రోల్ చేసారు

  సోషల్ మీడియాలో తన ఫొటోలు పెట్టి, తన ఎక్సప్రెషన్స్త్ తో ట్రోల్ చేసారని ఆమె చెప్తోంది.

  ఖండించారు

  ఖండించారు

  మళయాళంలో ఆమె తోటి హీరోయిన్స్ కూడా ఇది పద్దతి కాదంటున్నారు

  నవీన్ ఫ్యాన్స్ మాత్రం

  నవీన్ ఫ్యాన్స్ మాత్రం

  ప్రేమమ్ హీరో నవీన్ ఫ్యాన్స్ ఎక్కువ మంది..ఈ ట్రోల్ చేసిందని తేలింది

  ఇదో కొత్త ట్రెండ్

  ఇదో కొత్త ట్రెండ్

  ఇలా హీరోలను,హీరోయిన్స్ ని ట్రోల్ చేయటం ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్

  అబ్జర్వ్

  అబ్జర్వ్

  ప్రేక్షకులకు గతంలో లాగ లేరని, ప్రతి విషయాన్ని కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారని సీనియర్స్ అంటున్నారు

  జాగ్రత్తలు

  జాగ్రత్తలు

  క్రేజ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి సమస్యలే ఎదురౌతాయి

  పేరే తెచ్చింది

  పేరే తెచ్చింది

  ట్రోల్ చేయటం బాద అనిపించినా..అసలు ఈమెకు గుర్తింపు వచ్చింది వాటితోనే అనేది నిజం

  బిజిగా

  బిజిగా

  ఇప్పుడు ఆమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న సాహసం శ్వాసగా సాగిపో తో బిజీగా ఉంది

  నమ్మకాలు

  నమ్మకాలు

  గౌతమ్ మీనన్ తొలి నుంచి హీరోయిన్స్ హైలెట్ చేస్తూ సినిమాలు తీస్తూంటారు. కాబట్టి తనకి గుర్తింపు వస్తుందని భావిస్తోంది

  సమంత అవుతుందేమో

  సమంత అవుతుందేమో

  నాగచైతన్యతో ఏమి మాయ చేసావే లో చేసిన సమంత ఆ తర్వాత బిజి హీరోయిన్ అయ్యిపోయింది. తను ఈ సినిమాతో అలా అవుతానని కలలు కంటోంది

  తెలుగులోనూ క్రేజ్

  తెలుగులోనూ క్రేజ్

  తెలుగులోనూ ఒకటి రెండు ఆఫర్స్ వచ్చినా ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది

  రిలీజ్ అయ్యాక

  రిలీజ్ అయ్యాక

  సాహసం శ్వాసగా సాగిపో చిత్రం రిలీజ్ అయ్యాక కొత్త చిత్రాలు కమిట్ అవ్వాలనే ఆలోచనలో ఉందామె

  English summary
  In a recent interview, Manjima opened up about the social media attack she faced, after the release Oru Vadakkan Selfie.According to Manjima, a group of audiences even suggested her to quit acting, after watching the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X