»   » ముద్దు సీన్: డైరెక్టర్‌పైకి తోసేస్తున్న మహేష్ హీరోయిన్

ముద్దు సీన్: డైరెక్టర్‌పైకి తోసేస్తున్న మహేష్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన '1' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన భామ క్రితి సానన్. తొలి చిత్రం ప్లాపయినప్పటికీ బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంది. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న 'హీరోపంటి' అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య ఘాటైన ముద్దు సీన్ ఉంది. ఈ విషయమై క్రితి సానన్ మాట్లాడుతూ....'నాకు ముద్దు సీన్లు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చారు. తొలుత దర్శకుడు నా వద్దకు ఈ ప్రతి పాదనను తెచ్చినపుడు నిర్మొమహాటంగా తిరస్కరించాను' అని తెలిపింది.

I Was Hesitant About Lip-Lock: Kriti Sanon

అయితే సినిమాకు ఆ ముద్దు సీన్ ఎంతో ముఖ్యమైనదని దర్శకుడు సబ్బీర్ ఖాన్ తెలిపారు. సీన్ డిమాండ్ చేయడం వల్ల ఇష్టం లేకున్నా ముద్దు సీన్లో నటించాను. సినిమా రంగంలో వచ్చినప్పుడు పర్సనల్ అభిప్రాయాల గురించి కాకుండా ప్రొఫెషనల్‌గా ఆలోచించాలి. అందుకే ఆ సీన్ చేసాను అని తెలిపింది.

దీంతో పాటు ఆమె మరన్ని సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఫిలింమేకర్ సాజియ్ నదియద్ వాలా ఆమెకి మూడో సినిమా ఆఫర్ చేశాడని టాక్. ' హీరో పంటి ' మూవీలో ఆమె పర్ఫార్మెన్స్ నచ్చడంతో తన తర్వాతి సినిమా అయిన ' హౌజ్ ఫుల్-3 ' మూవీ సీక్వెల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడట.

English summary
Actress Kriti Sanon, who is making her big screen debut with "Heropanti", has locked lips with newcomer Tiger Shroff for the film. But she says she was hesitant about it as she comes from a conservative family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu