»   »  సల్మాన్‌ఖాన్‌ అంటే భయం అని తేల్చి చెప్పింది

సల్మాన్‌ఖాన్‌ అంటే భయం అని తేల్చి చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: తనకుబాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ అంటే భయమని నటి ప్రీతిజింతా తెలిపారు. ప్రీతిజింతా బాలీవుడ్‌లో సినీ కెరీర్‌ ప్రారంభించి 17ఏళ్లు పూర్త్తెయింది. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో లైవ్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు.

17ఏళ్ల సినీ కెరియర్‌లో ప్రీతి.. సల్మాన్‌తో కలిసి ఐదు సినిమాల్లో నటించింది. కానీ తనకు సల్మాన్‌ఖాన్‌తో కలసి నటించడం అంటే భయమని తన మనసులో మాటను తెలియజేసింది. కేవలం సల్మాన్‌తో నటించేటప్పుడే తనకు భయం వేస్తుందని.. అలా ఎందుకు జరుగుతుందో తనకు తెలీదని ప్రీతిజింతా తెలియజేసింది.

I was scared of Salman Khan, says Preity Zinta

అలాగే తనతో కలిసి నటించిన సహనటుల్లో రాణీముఖర్జీ అంటే ఇష్టమని చెప్పింది. తెరపై రాణీముఖర్జీ కెమిస్ట్రీ బాగుంటుందని.. అందుకే బెస్ట్‌ కో-స్టార్‌ అవార్డు రాణీముఖర్జీకి ఇస్తానని తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక షారూఖ్ ఖాన్ గురించి చెప్తూ...తాను షారూఖ్ తోచేసేటప్పుడు ఎమోషన్ సీన్లలో ఏడుస్తానని అన్నారు. నేను చాలాసార్లు అలా ఏడ్చేసాను అని చెప్పారామె.

సైఫ్ అలీఖాన్ గురించి చెప్తూ... ఎప్పుడూ నవ్వుతూ,ఫన్ గా ఉండే క్రీజీ హీరో అంటూ ఆమె మెచ్చుకున్నారు. అతనితో పనిచేయటం చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పారామె.

English summary
Actress Preity Zinta has revealed she was scared of Salman Khan before she shared the screen space with the superstar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu