»   » హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ వాగ్మూలం ఇదే...

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ వాగ్మూలం ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ‘ముంబైలో అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కారును తాను నడపలేదని సల్మాన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తన డ్రైవర్ అశోక్ సింగ్ కారును నడుపుతున్నాడు' అని వివరించారు. అదే సమయంలో తాను మద్యం తాగి ఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని..తాను ఎలాంటి మద్యం తీసుకోలేదని స్పష్టం చేశారు సల్మాన్.

2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను శుక్రవారం రికార్డు చేసింది.

 I Wasn't Driving, Wasn't Drunk : Salman Khan

కోర్టులో శుక్రవారం బోనులో నిలబడి తన వాదనలు వినిపించారు. 2004లో జరిగిన ఆ ఘటనకు సంబంధించి తన వాదన వినిపించడానికి ఖాన్‌కు ఇదొక కీలకమైన అవకాశం. సల్మాన్‌ఖాన్ వాంగ్మూలంతో కేసు విచారణ దాదాపు పూర్తయినట్లే. అనంతరం కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేరం రుజువైతే సల్మాన్‌ఖాన్‌కు ఎలాంటి శిక్షపడుతుందన్న దానిపై చర్చలు జోరందుకున్నాయి.

English summary
Actor Salman Khan, giving his version of a 2002 hit-and-run case for the first time in a court today, said he was not driving the SUV that ran over people sleeping on a pavement in Mumbai, his driver Ashok Singh was.
Please Wait while comments are loading...