»   » భార్యకు మద్దతుగా హీరో ఎన్నికల ప్రచారం

భార్యకు మద్దతుగా హీరో ఎన్నికల ప్రచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : తన భార్య గీతా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటే ఆమె తరుఫున ప్రచారానికి సిద్ధమని కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌ అన్నారు. ఆయన నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గీతా రాజకీయ అరంగేట్రం తనతో పాటు తన కుటుంబు సభ్యులకు కొత్త అనుభూతి కాదన్నారు. ఆమె రక్తంలోనే రాజకీయం ఉందన్నారు.

తానే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నా తన తల్లి ఆరోగ్య సరిగా లేని కారణంగా గీతా రంగంలో దిగిందన్నారు. ఈనెల 17న గీతా రాజకీయరంగ ప్రవేశంపై మరింత స్పష్టమైన వివరణ ఇవ్వనున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్‌ జీడీఎస్‌ అభ్యర్థినిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

I will campaign for my wife, party is immaterial: Shivarajkumar

మరో ప్రక్కన శివరాజకుమార్...డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. పరభాషా సినిమాలతో ఎదురయ్యే పోటీని నిలువరించి కన్నడ చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1960లో ఇతర భాషల సినిమాలను కన్నడలోకి డబ్‌ చేయడాన్ని నిషేధించారు. చిత్ర పరిశ్రమ తనకుతానుగా ఈ నిర్భందాన్ని విధించుకుంది. అంతేకాదు పరభాషా చిత్రాలు కర్ణాటకలో 21 ప్రింట్లకు మించి విడుదల చేయరాదనే ఆంక్షలను విధించారు. అప్పట్లో జరిగిన పోరాటానికి కన్నడ కంఠీరవుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ నేతృత్వం వహించారు.

అప్పటి నుంచి డబ్బింగ్‌కు అవకాశం లేదు. ఆ దిశగా ఎవ్వరూ కనీసం ఆలోచించడానికీ జంకేవారు. చిత్రపరిశ్రమ అంతా ఒక్కతాటిపై ఉంటూ వచ్చింది. రాజ్‌కుమార్‌ మరణానంతరం డబ్బింగ్‌ అంశం తెరమీదకు వచ్చినప్పటికీ విష్ణువర్ధన్‌, అంబరీష్‌ తదితర హీరోలు, ఇతర ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించడంతో తెరపడింది. రాజ్‌కుమార్‌ తరువాత అంతటి కథానాయకుడు విష్ణువర్ధన్‌ మరణం, అంబరీష్‌ రాజకీయాల్లో తీరికలేకుండా ఉంటూ చిత్రపరిశ్రమకు దూరం కావడం అదే సమయంలో కాంపిటిషన్‌ కమిషన్‌ నివేదిక రావడం.. ఈ అంశాలూ డబ్బింగ్‌ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చాయి. కన్నడ నిర్మాతల సంఘంలో మెజారిటీ సభ్యులు డబ్బింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోలు ఈ విషయమై స్పందించలేదు.

English summary
Actor Shivarajkumar has said he will campaign for his wife, Geetha Shivarajkumar, who will contest the Lok Sabha election from Shimoga on the Janata Dal (Secular) ticket.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu