»   » ఆ హీరోతో డేటింగ్ చేస్తా.. ఏ హీరో ఇంటిని గిఫ్ట్‌గా ఇవ్వలేదు.. రకుల్

ఆ హీరోతో డేటింగ్ చేస్తా.. ఏ హీరో ఇంటిని గిఫ్ట్‌గా ఇవ్వలేదు.. రకుల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. అగ్రహీరోల సరసన నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అనే హోదాను సంపాదించుకొన్నది. ప్రస్తుతం మురుగదాస్, ప్రిన్స్ మహేశ్ దర్శకత్వంలో వస్తున్న స్పైడర్ చిత్రలో మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తున్నది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకొన్నారు.

గోల్డెన్‌ లెగ్‌ .. ఐరెన్‌లెగ్‌

గోల్డెన్‌ లెగ్‌ .. ఐరెన్‌లెగ్‌

తొలి చిత్రం విజయం సాధించడంతో గోల్డెన్‌ లెగ్‌ అని అన్నారు. ఆ తర్వాత రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోయేసరికి ఐరెన్‌లెగ్‌ అన్నారు. మళ్లీ సినిమాలు సక్సెస్ సాధించడంతో తిరిగి గోల్డెన్‌ లెగ్‌ అంటున్నారు. ఈ బిరుదులు శాశ్వతం కాదు. ఐరెన్‌లెగ్‌ అని అన్నా పట్టించుకోను అని రకుల్ అన్నారు.


ఇంటిని ఓ హీరో బహుమతిగా

ఇంటిని ఓ హీరో బహుమతిగా

ఇటీవల కొనుగోలు చేసిన ఇంటిని ఓ హీరో బహుమతిగా ఇచ్చారు అనే రూమర్‌ను రకుల్ ఖండించారు. నేను కొనుగోలు చేసిన ఇంటి విలువ మూడు కోట్లు. ఎవరో గిఫ్ట్ ఇస్తే నేను బ్యాంక్ లోన్ ఎందుకు తీసుకొంటాను. ఇలాంటి వార్తలు రావడంతో నా కుటుంబం బాధపడింది అని ఆమె అన్నారు.


రెజీనా నా ఫ్రెండ్..

రెజీనా నా ఫ్రెండ్..

రెజీనా కసండ్రా నాకు మంచి ఫ్రెండ్. ఆమెను నేనెప్పుడు పోటీగా ఫీలవ్వలేదు. ఎవరి అవకాశాలు వారికి ఉంటాయి. ఇక్కడ కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఒకరు పోటీ అనుకుంటే రాణించలేము. ఆరోగ్యమైన పోటీ ఉంటే తప్పేమీ కాదు అని అన్నారు.


 రణ్‌వీర్‌తో డేటింగ్..

రణ్‌వీర్‌తో డేటింగ్..

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ డేటింగ్ చేయాల్సి వస్తే అతడితో చేయడానికి ఇష్టపడుతాను. గతంలో యారియాన్ అనే హిందీ సినిమాలో నటించింది. ప్రస్తుతం షిమ్లా మిర్చి అనే చిత్రంలో నటిస్తున్నది.English summary
Rakul Preet Singh is now star heroine in Tollywood. Now she is romancing with Prince Maheshbabu in spyder movie. she shares her views with a media about her personal and professional things.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X