»   » కిక్ ఇస్తే చాలు, చీప్‌గా చూడను అంటోన్న హీరోయిన్ కాజల్

కిక్ ఇస్తే చాలు, చీప్‌గా చూడను అంటోన్న హీరోయిన్ కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లు ఓ వైపు లీడ్ రోల్స్ చేస్తూనే... మరో వైపు అవకాశాన్ని బట్టి ఐటం సాంగ్స్ సైతం చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. అయితే సౌత్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ ఐటం సాంగ్స్ చేసే వారిని కాస్త చీప్ గా చూస్తారు. అందుకే చాలా మంది హీరోయిన్లు వాటి జోలికి పోవడానికి ఇష్టపడరు.

అయితే హీరోయిన్ కాజల్ మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా దూసుకెలుతోంది. ఇటీవల కాజల్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' చిత్రంలో పక్కా లోకల్ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై కూడా స్పెషల్ సాంగులు చేస్తాను అంటోంది.

I will do special songs: Kajal Agarwal

స్పెషల్ గీతాలను చీప్ గా చూడాల్సిన అవసరం లేదు. కథలో స్పెషల్ సాంగ్ ప్రాధాన్యత ఉంటే తప్పకుండా చేస్తాను. అయితే ముదు నాకు అది నచ్చాలి, మంచి కిక్ ఇచ్చేలా ఉండాలి. పక్కాలోకల్ సాంగులో అలాంటి కిక్ ఉంది కాబట్టే చేసారు. స్టార్ హీరోలతోనే కాదు, కొత్త హీరోలతో కూడా చేయడానికి చేయడానికి కూడా సిద్ధమే అని కాజల్ తెలిపారు.

కాజల్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో బిజీగా గడుపుతోంది. అజిత్ హీరోగా తమిళంలో శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు, విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. దీంతో పాటు తెలుగులో తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు నేను మంత్రి చిత్రంలో కాజల్ నటిస్తోంది.

English summary
"I will do special songs with star heros and upcoming heros also" actress Kajal Agarwal said recent interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu