»   » నాకు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను: పివిపి

నాకు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను: పివిపి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పివిపి సినిమా అధినేత, ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త, విజయవాడకు చెందిన ప్రసాద్ వి పొట్లూరి గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో ఆయన వెనక ఉండే అన్ని చూసుకున్న పివిపి... ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు వీలైనంత దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పివిపి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్ చేసారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనని.... తనకు నచ్చని పని అని చెప్పుకొచ్చారు.

పివిపి అలా అనడానికి చాలా పెద్ద కారణమే ఉంది. తాను యూరఫ్ లో ఉన్నప్పటి నుండే పవన్ కళ్యాణ్ పరిచయం అని, మా ఇద్దరికీ చేగువేరా అంటే ఇష్టం. అందరికీ సమానత్వం ఉండాలనుకునే మా ఇద్దరి భావనలు కలిసి ఫ్రెండ్స్ అయ్యామని తెలిపారు.

పవన్ కళ్యాణ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ మొదలు పెడదామని అనుకుంటున్నట్లు నాకు చెప్పారు... నాకు నచ్చడంతో మాట, మద్దతు ఇలా తనకు చేతనైన సహాయం చేసానని పివిపి తెలిపారు. జనసేన పార్టీని అడ్డుకు పెట్టుకుని నేను విజయవాడ ఎంపీ సీటుకు ప్రయత్నించాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

జనసేన పార్టీకి దూరమైన కారణాన్ని వివరిస్తూ...పవన్ కళ్యాణ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ మొదలు పెడదామన్నారు. కానీ మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. అది నాకు, మరికొందరికి నచ్చలేదు. అందుకే పక్కకు వచ్చేసాం. నాకు ఏదైనా నచ్చకపోతే పక్కకు వచ్చేస్తా అంతే అని స్పష్టం చేసారు పివిపి.

జనసేన పార్టీకి నేను పెట్టుబడి పట్టానని, ఫైనాన్స్ చేసాను అనే దాంట్లో నిజం లేదు. నా పెట్టుబడి అంతా సినిమారంగంలోనే. జనసేనలో కాదు. ఇపుడు అవన్నీ సెటిల్ అయిపోయాయి అని పివిపి తెలిపారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ 'చేయను' అని నిర్మొహమాటంగా చెప్పారు పివిపి. నాకు ఇష్టంలేని పని చేయమన్నా చేయను అని తేల్చి చెప్పారు పివిపి.

టాయిలెట్ క్లీనింగు చేసే పనితో మొదలైన తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు కూడా పత్రిక ఇంటర్వ్యూలో పివిపి వెల్లడించారు. స్లైడ్ షో అందుకు సంబంధించిన విషయాలు....

అమెరికా ఆశ...

అమెరికా ఆశ...

ఇంజనీరింగ్ పూర్తయ్యాక అమెరికా వెళ్లాలని ప్రయత్నించాను, వీసా రాక పోవడంతో లక్షన్నర అప్పుచేసి ఆస్ట్రేలియా వెళ్లాను.

టాయిలెట్ క్లీనింగ్

టాయిలెట్ క్లీనింగ్

ఆస్ట్రేలియాలో ఫీజు కట్టడం ఒకరోజు ఆలస్యం అయినా ఇంటికే. పార్ట్ టైం జాబ్ కోసం వెతికితే టాయిలెట్ క్లీనింగ్ జాబ్ దొరికింది. ఈ పని చేస్తున్నందుకు బాధ పడ్డాను, ఏడ్చాను. తొమ్మిది నెలలు చేసాను. ఆ పనే నాలో పట్టుదల పెంచింది అన్నారు పివిపి.

అమెరికా, యూరఫ్ లో వ్యాపారాలు

అమెరికా, యూరఫ్ లో వ్యాపారాలు

ఆస్ట్రేలియాలో ఉంటూ అమెరికా వీసా సంపాదించాను. అక్కడ రకరకాల ఉద్యోగాలు చేసారు. కంపెనీ పెట్టాను. అమ్మాయి. తర్వాత యూరఫ్ వెళ్లాను. యూరఫ్ లో ఫైనాన్స్ కన్సల్టెన్సీ పెట్టాను. క్రిసిల్ లాంటి పెద్ద కంపెనీ దాన్ని టేకోవర్ చేయడంతో బాగా డబ్బు వచ్చింది. తర్వాత ఇండియా వచ్చాను అని పివిపి తెలిపారు.

సినిమా రంగంలో

సినిమా రంగంలో

సినిమా రంగంలో నేను బాగా పోగొట్టుకుంది అంటే ‘వర్ణ' సినిమా వల్లనే. కానీ సినిమా రంగం నాకు బాగా నచ్చింది అన్నారు.

మహేష్ బాబు గురించి..

మహేష్ బాబు గురించి..

మహేష్ బాబు సినిమా అంటే చాలా తపన ఉన్న వ్యక్తి. ఒక్కోసారి అతడి డెడికేషన్ చూసి నాకే ఆశ్చర్యం వేసేది అన్నారు పివిపి.

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం సినిమాతో తొలిసారి మా సంస్థకు రిలీజ్ ముందే మంచి లాభాలు వచ్చాయి. ఇదొక మంచి సినిమా. బంధాలు, అనుబంధాల విలువను ఇప్పటి తరానికి తెలియజెప్పే సినిమా ఇదని పివిపి అన్నారు.

English summary
"I Will never work with Pawan Kalyan" Said Tollywood producer Prsad v Potluri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu