»   » నా అవార్డులు వెనక్కి ఇవ్వను, సమర్థించను: కమల్ హాసన్

నా అవార్డులు వెనక్కి ఇవ్వను, సమర్థించను: కమల్ హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభుత్వం ఇచ్చే జాతీయ అవార్డులను కొందరు సినీ ప్రముఖులు, రచయితలు వెనక్కి ఇవ్వడాన్ని ఈ మధ్య చూస్తున్నాం. కానీ అలాంటి చర్యలను నేను అస్సలు సమర్ధించను, నా అవార్డులను వెనక్కి ఇచ్చే ఉద్దేశ్యం తనకు లేదని కమల్ హాసన్ స్పష్టం చేసారు. నవంబర్ 12న విడుదలవుతున్న తన తాజా సినిమా ‘చీకటి రాజ్యం' ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కమల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.

కమల్‌హాసన్‌, త్రిష, ప్రకాశ్‌ రాజ్‌లు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం 'చీకటిరాజ్యం' . ఈ చిత్రం ఆడియోని నవంబర్ 3న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసారు. దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా తమిళ వెర్షన్ నవంబర్ 10న రిలీజ్ కానుంటే, తెలుగులో నవంబర్ 12న రిలీజ్ చేయనున్నారు.


I will not give back my national award, says Kamal Hasaan

హాలీవుడ్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్' సినిమాకి స్పూర్తిగా వస్తున్న ఈ సినిమా కూడా హాలీవుడ్ స్టైల్ లోనే ఉంటుందట. ఈ సినిమా రన్ టైం కేవలం 127నిమిషాలతో సూపర్ ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకోనుంది. ఈ సినిమాలో ఒక రెస్టారెంట్‌లోని కిచెన్‌లో త్రిష, కమల్‌ల మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం.


'చీకటి రాజ్యం' ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటికొస్తారు. సినిమా అనేది ఎవరి కారణంగా విజయం సాధిస్తుందో చెప్పలేం. 'షోలే'లో అందరికీ గబ్బర్‌సింగ్‌ పాత్రే గుర్తుంటుంది. అలా ఏ సినిమాతో ఎవరికి గుర్తింపు లభిస్తుందో తెలియదు అంటున్నారు కమల్ హాసన్.

English summary
I will not give back my national award, says Kamal Hasaan.
Please Wait while comments are loading...