»   » పవన్ బాబాయ్‌తో పోల్చొద్దు, నేనూ ఫ్యానే : రామ్ చరణ్

పవన్ బాబాయ్‌తో పోల్చొద్దు, నేనూ ఫ్యానే : రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ బాబాయ్‌తో పొల్చవద్దంటూ రామ్ చరణ్ ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పవన్ బాబాయ్‌తో నన్ను నేను ఎన్నటికీ పోల్చుకోను. ఆయన స్థాయి వేరు...ఆయన స్టైల్ వేరు. నన్ను ఆయనతో పోల్చుకోదగ్గ మెచ్యూరిటీ నాకు రాలేదు. నేను కూడా ఆయనకు పెద్ద అభిమానిని.' అని స్పష్టం చేసాడు రామ్ చరణ్.

జంజీర్ చిత్రం ద్వారా తొలిసారిగా టాలీవుడ్ పరిధి దాటి బాలీవుడ్లో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పిన రామ్ చరణ్....తెలుగు వాడిగా ఇక్కడ తన సత్తా ఏమిటో నిరూపించుకుంటాను అని వెల్లడించారు. తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా ప్రేక్షకుల సపోర్టు వల్లనే తాను ఇంత ఎత్తుకు ఎదిగానని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రత్యేకమైన డైట్ ఏమీ తీసుకోనని చెప్పిన చరణ్....ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోవడాన్ని ఇష్టపడతానని వెల్లడించారు. నాకు వరి అన్నం అంటే ఇష్టం. దాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను. బ్రిటిష్ డైట్...అమెరికన్ డైట్ ఫాలో అవ్వను. కష్ట పడి పని చేయడమే నా బాడీ ఫిట్ నెస్ సీక్రెట్ అంటున్నాడు చరణ్.

ఖాళీ సమయాల్లో తన గుర్రాలతో ఎక్కువ గడుపుతానని, రైడ్ చేయడానికి ఇష్టపడతాను. వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. వాటిని నా సొంత పిల్లలకంటే ఎక్కువగా చూసుకుంటాను అని వెల్లడించారు. ఇంట్లోఉంటే మాత్రం బుక్స్ చదవడం, మూవీస్ చూడటం లాంటివి చేస్తుంటాను అని స్పష్టం చేసాడు చరణ్.

English summary
"I would never compare myself to my uncle (Pawan Kalyan). I, too, am a big fan of his. He has his own position and his own style. I don't think that I have matured yet as an actor to be compared to him" Ram Charan told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu