»   » మోహన్‌లాల్‌- సత్యరాజ్‌ "ఇద్దరూ ఇద్దరే"!!

మోహన్‌లాల్‌- సత్యరాజ్‌ "ఇద్దరూ ఇద్దరే"!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్‌లాల్‌- సత్యరాజ్‌ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వీళ్ళిద్దరూ కలిసి నటించిన మలయాళ చిత్రం 'లైలా.. ఓ లైలా'. ప్రముఖ మలయాళ దర్శకుడు జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'ఇద్దరూ ఇద్దరే' పేరుతో అనువదిస్తున్నారు.

రాహుల్‌దేవ్‌, సోనూసూద్‌ ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని కె.ఆర్‌.ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై కందల కృష్ణారెడ్డి 'ఇద్దరూ ఇద్దరే'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ధియేటర్ ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది. "ప్రేమమ్" ఫేమ్ గోపిసుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను త్వరలో విడుదల చేసి.. నవంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చెందుకు నిర్మాత కందల కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మనమంతా', 'జనతా గ్యారేజి' చిత్రాల్లో నటించడానికి ముందే మోహన్‌లాల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఇక 'మిర్చి', 'బాహుబలి' చిత్రాలతో సత్యరాజ్‌కు తెలుగులో ఏర్పడిన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. వీళ్ళిద్దరూ పవర్‌ఫుల్‌ పాత్రలు పోషించిన చిత్రం 'ఇద్దరూ ఇద్దరే'.

"Iddaru Iddhare" movie details

అలాగే ఈ చిత్రంలో మోహన్‌లాల్‌కు జంటగా నటించిన అమలాపాల్‌ గ్లామర్‌ ఒలికించడంతోపాటు పర్‌ఫార్మెన్స్‌కు స్కోపున్న మంచి క్యారెక్టర్‌ చేసింది. మోహన్‌లాల్‌, సత్యరాజ్‌, అమలాపాల్‌తో పాటు రమ్య నంబిసన్‌, రాహుల్‌దేవ్‌, సోనూసూద్‌ తదితర సుపరిచితులు నటించిన సినిమా కావడంతో .. డబ్బింగ్‌ సినిమాలా కాకుండా స్ట్రయిట్‌ సినిమా చూస్తున్న అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారు.

ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వస్తోంది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియో విడుదల చేసి, నవంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.లోకనాథన్‌, ఎడిటింగ్‌: శ్యాం శశిధరన్‌, సంగీతం: గోపి సుందర్‌, నిర్మాణ నిర్వహణ: డి.నారాయణ, నిర్మాత: కందల కృష్ణారెడ్డి, దర్శకత్వం: జోషి!!

English summary
Mohanlal & Satyaraj Starring "Iddaru Iddhare" Ready for Release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu