ఉమ్మి వేస్తే ఛీ కొడతా : విద్యా బాలన్
హైదరాబాద్: ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తే వారి మొహం మీదే తిరిగి ‘ఛీ' కొడతానని....గత కొన్నేళ్లుగా తనకు ఇది అలవాటయిందని అంటోంది బాలీవుడ్ నటి విద్యా బాలన్. ఉమ్మేసే వారు రిక్షా వాలా అయినా....కారు డ్రైవర్ అయినా...ఇంకెలాంటి ప్రముఖలయినా వదిలి పెట్టను. నేను ‘ఛీ' అనడం వల్ల వారు బాధ పడతారని తెలుసు. కానీ అది వారిలో మార్పును తెస్తుంది అంటోంది విద్యా బాలన్.
అంతే కాకుండా తన చుట్టు పక్కల పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే అస్సలు ఊరుకోను అని అంటోంది విద్యా. తన ఇంటి చుట్టు పక్కల ఎవరైన చెత్త పడేస్తే చేతికి గ్లౌజులు వేసుకుని ఆ చెత్తను తీసి డస్ట్ బిన్ లో పడేస్తాను అని విద్యా బాలన్ చెప్పుకొచ్చారు. ఎవరైనా సిగరెట్ పీకలు, చాకొలెట్ వేపర్స్ చెత్త బుట్టలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అస్సలు అస్సలు ఊరుకోను అని చెప్పింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

2012లో విద్యా బాలన్ సానిటేషన్ నేషల్ అబాసిడర్‌గా అపాయింట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి విద్యా బాలన్ ఇలాంటి విషయాలపై మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టింది. చుట్టు పక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే మన ఆరోగ్యంగా ఉంటామనేది విద్యా బాలన్ వాదన.


Click it and Unblock the Notifications











