twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోపం చల్లారలేదు, వారసత్వ హీరోలే ఆమె టార్గెట్: పాకాన పడ్డ ఇండస్ట్రీ వివాదం

    |

    కంగనా రనౌత్ మీద, వారసత్వంమీద చేసిన జోకులు మిస్ ఫైర్ అయినందుకు సైఫ్ క్షమాపణ చెప్పాడు అదీ లిఖిత పూర్వకంగా... ఐఫా అవార్డుల వేడుకలో వారసత్వం, కంగనారనౌత్‌పై జోకులు పేల్చిన కరణ్ జోహార్, వరుణ్ ధవన్‌లకు సైఫ్ జత కలిశారు. అది కాస్తా చిలికి..చిలికి గాలివానగా మారడంతో కరణ్, వరుణ్ క్షమాపణలు కోరేదాకా వెళ్లింది. తాజాగా ఈ వివాదంపై సైఫ్ అలీ ఖాన్ కూడా స్పందించారు. దానికి వివరణ ఇచ్చారు. క్షమాపణలు కోరుతూ కంగనా రనౌత్‌కు మెసేజ్ పెట్టానని సైఫ్ అలీ ఖాన్ చెప్పాడు అలాంటి వివాదాస్పద జోక్‌లో తానూ భాగమైనందుకు చింతిస్తున్నానని చెప్పి పర్సనల్ గానే కాకుండా పబ్లిక్ గా కూడా చెప్పాడు... అయితే కంగనా కోపం ఇంకా చల్లారలేదు... ఈ క్షమాపణకు కూడా ఘాటు గానే రిప్లై పబ్లిక్ గా ఇచ్చింది కంగనా...

    వారసత్వం వర్ధిల్లాలి

    వారసత్వం వర్ధిల్లాలి

    ఐఫా అవార్డుల వేడుకలో భాగంగా సైఫ్, కరణ్, వరుణ్ పేల్చిన జోకేంటంటే...

    సైఫ్: నువ్వు మీ నాన్న వల్లే ఇక్కడి దాకా వచ్చావు
    వరుణ్: నువ్వు మాత్రం మీ అమ్మ పేరు చెప్పుకొని రాలేదా..?
    కరణ్: నేనైతే మా నాన్న యశ్ జోహార్ వల్లే ఇక్కడిదాకా వచ్చాను. అనంతరం ‘వారసత్వం వర్ధిల్లాలి' అంటూ నినదించారు ముగ్గురు. అంతేకాదు.. ముగ్గురూ ‘బోలే చూడియా.. బోలే కంగనా..' అంటూ ఓ పాట అందుకున్నారు.

    కంగనా ఎక్కువ మాట్లాడేస్తోంది

    కంగనా ఎక్కువ మాట్లాడేస్తోంది

    అంతలోనే కరణ్ కల్పించుకుని కంగనా మాత్రం బాగా ఎక్కువ మాట్లాడేస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. అది బాగా వివాదం అయింది. వారు క్షమాపణలు చెప్పేదాకా వెళ్లింది. దానికి గానూ కరణ్, వరుణ్ ఇద్దరూ వెంటనే బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. సైఫ్ కూడా తన మెసేజ్ ద్వారా కంగనకు లేఖ పంపి మళ్ళీ బయటకూడా వివరణ ఇచ్చాడు...

    షర్మిలా ఠాగూర్ కుమారుడిగా

    షర్మిలా ఠాగూర్ కుమారుడిగా

    ఇండస్ట్రీలో వారసత్వం అనే అంశంపై నిజంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. షర్మిలా ఠాగూర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి రావడం తనకు చాలా తేలికైందని, కానీ, టాలెంట్ లేనిదే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేవాడినా అని ప్రశ్నించాడు.

    స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది

    స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది

    అయినా సరే కంగన మాత్రం తన మాటమీదే ఉంటూ ఇంకో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.. సైఫ్ రాసిన ఓపెన్ లెటర్‌కు బదులుగా మరో ఓపెన్ లెటర్ రాస్తూ వారసత్వంపై తన మాటకు కట్టుబడే ఉంటానని ప్రకటించారు. ఆ లేఖలో ఏముందో ఆమె రాతల్లోనే చూస్తే ఈ విషయాన్ని కంగనా ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమైపోతోంది.

    మంచి చర్చకే బాటలు వేశారు

    మంచి చర్చకే బాటలు వేశారు

    "అవార్డుల వేదికపై జరిగిన చర్చ చాలా చిరాకుగా అనిపించినా.. మంచి చర్చకే బాటలు వేశారు. అందులోని కొన్ని కోణాలను నేను ఎంజాయ్ చేసినా.. మరికొన్ని నిరాశకు గురిచేశాయి. దీనిపై సైఫ్ రాసిన లేఖతోనే నేను నిద్ర లేచాను. చివరిసారిగా కరణ్ జోహార్ వారసత్వంపై ఓ బ్లాగ్ రాశారు. ఇప్పటి వ్యాఖ్యల కన్నా ఆ బ్లాగ్ నన్ను చాలా బాధించింది.

    కించపరిచారు, అవమానపరిచారు

    కించపరిచారు, అవమానపరిచారు

    సినీ వ్యాపారానికి టాలెంట్‌తో సంబంధం లేదని, దానికి వెనక ఇంకా ఎన్నో ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఆయన తప్పుడు సమాచారంతోనో లేదంటే సరైన జ్ఞానం లేకుండానో చేసి ఉంటారు. ఆ వ్యాఖ్యలు ఎలా చేసినా.. ఆనాటి మహానటులు దిలీప్ కుమార్, కే ఆసిఫ్, బిమల్ రాయ్, సత్యజిత్ రే, గురు దత్ తదితర మహామహుల టాలెంట్, వారి అత్యున్నత ప్రమాణాలను కించపరిచారు. అవమానపరిచారు.

    ఓపెన్ లెటర్

    ఓపెన్ లెటర్

    ఇప్పటికీ ప్రపంచంలో అనేక రంగాల్లో టాలెంట్‌కు కాకుండా అలాంటి వారికే పట్టం కడుతున్నారనడానికి చాలా ఉదాహరణలున్నాయి. సైఫ్ నాకు ఈ విషయాన్నే ఉటంకిస్తూ ఓపెన్ లెటర్ రాశారు. దీనిపై నా ఉద్దేశాన్ని చెబుతున్నాను. దయచేసి ఎవరూ నా అభిప్రాయాలను తప్పుగా అర్థం చేసుకోవద్దు.

    ఇది నా ఒక్కదాని సమస్యే కాదు

    ఇది నా ఒక్కదాని సమస్యే కాదు

    సైఫ్.. మీరు మీ లేఖలో ‘కంగనాకు నేను క్షమాపణలు చెప్పాను. ఇంక, ఈ విషయంలో ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడితో ముగిసిపోయింది'' అని అన్నారు. కానీ, ఇది నా ఒక్కదాని సమస్యే కాదు. ప్రజ్ఞాపాటవాలు లేకపోయినా మానవుల భావోద్వేగాలను ఆధారం చేసుకుని ‘వారసత్వం' అనే దానినే ఎక్కువగా వాడుకుంటున్నారు.

    మానవ భావోద్వేగాలతో చేసే వ్యాపారం

    మానవ భావోద్వేగాలతో చేసే వ్యాపారం

    విలువలను వదిలేసి మానవ భావోద్వేగాలతో చేసే వ్యాపారంలో ‘పైకి' చెప్పుకొనే లాభాలేవస్తాయి. వాస్తవికతను చూస్తే.. 130 కోట్ల మంది ప్రజలకు ఆ లాభాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అన్ని చోట్ల వారసత్వం అనేది పనికిరాదు. మంచి విలువలు నేర్పి గొప్ప విజయం సాధించిన వారి నుంచి నేను ఈ విలువలు నేర్చుకున్నాను. ఆ విలువలు ఏ ఒక్కరి సొత్తూ కాదు. అందరికీ చెందినవి.

    సమాజం మొత్తానికి చెందిన వాళ్లు

    సమాజం మొత్తానికి చెందిన వాళ్లు

    స్వామి వివేకానంద, ఐన్‌స్టీన్, షేక్స్‌పియర్.. ఏ కొందరికో చెందిన వ్యక్తులు కాదు. వాళ్లంతా కూడా సమాజం మొత్తానికి చెందిన వాళ్లు. వాళ్లు చేసిన మంచి పనులు మనకు భవిష్యత్తునిచ్చాయి. మన పనులు మన ముందు తరాల వారికి భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి'' అన్నది కంగనా రాసిన లేఖ సారాంశం.

    English summary
    In her open letter, kangana Ranaut clarifies that her response to Saif's letter should not be viewed as a clash of individuals but as a healthy exchange of ideas. Ranaut largely countered Saif on three arguments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X