»   » ఐఫా అవార్డ్స్ హైలెట్స్: ఇద్దరు హీరోలను గాడిదపై ఊరేగించారు (ఫోటోస్)

ఐఫా అవార్డ్స్ హైలెట్స్: ఇద్దరు హీరోలను గాడిదపై ఊరేగించారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాడ్రిడ్ (స్పెయిన్): బాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించిన ఐఫా(ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్)-2016 అవార్డుల కార్యక్రమం స్పెయిన్ లోని మాడ్రిడ్ నగరంలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ స్టార్స్ అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

గత కొన్నేళ్లుగా ఐఫా అవార్డుల కార్యక్రమం నిర్వాహకులు ప్రతి ఏటా ఎంతో వైభంగా నిర్వహిస్తున్నారు. ఈ సారి జరిగింది 17వ ఎడిషన్ ఐఫా. గతంలో కంటే ఈ సారి మరింత భిన్నంగా, గ్రాండ్ గా అవార్డుల కార్యక్రమం జరిగింది.

సల్మాన్ ఖాన్, హృతి కోషన్, దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా లాంటి టాప్ స్టార్ల డాన్స్ పెర్ఫార్మెన్స్ హైలెట్ అయింది. అంతే కాదు..... ఈ కార్యక్రమానికి హాస్ట్ లుగా వ్యవహరించిన బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, పర్హాన్ అక్తర్ లను ఈ అవార్డుల కార్యక్రమానికి స్పెయిన్ గాడిదలపై ఊరేగిస్తూ తీసుకురావడం మరో హైలెట్. గాడిదలకు పట్టు బాలీసులు తొడిగి ఎంతో అందంగా అలంకరించి వాటిపై వీరిని ఊరేగించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఇక అవార్డుల విషయానికొస్తే... ఇటు బాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తున్న ప్రియాంక చోప్రా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. దీంతో పాటు బాజీరావు మస్తానీ చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు.

బాజీరావు మస్తానీ చిత్రానికి మొత్తం 12 అవార్డుల దక్కాయి. ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఉత్తమ దర్శకుడిగా, రణవీర్ కపూర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. పికు చిత్రానికి గాను దీపిక పదుకోన్ ఉత్తమ నటిగా ఎంపికైంది.

స్లైడ్ షోలో అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోస్, గాడిదపై ఊరేగింపు వీడియోస్....

గాడిదపై..

గాడిదపై..

ఐఫా అవార్డుల వేడుకలో షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ లను గాడిదపై ఊరేగిస్తున్న దృశ్యం.

లగ్జరీ కార్ల బదులు...గాడిదపై

లగ్జరీ కార్ల బదులు...గాడిదపై

సాధారణంగా లగ్జరీ కార్లలో స్టార్స్ ఇలాంటి కార్యక్రమాల్లో ఎంట్రీ ఇస్తుంటారు. వీరు మాత్రం అందంగా అలంకరించిన గాడిదలపై ఎంట్రీ ఇచ్చారు.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్

ఐఫా అవార్డుల వేడుకలో హృతిక్ రోషన్ పెర్ఫార్మెన్స్ హైలెట్ అయింది. ఆయన ఇందుకోసం రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ కూడా తన పెర్ఫార్మెన్స్ తో అలరించారు. సల్మాన్ ఇందుకుగాను రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసకున్నట్లు టాక్.

ప్రియాంక చోప్రా..

ప్రియాంక చోప్రా..

ఐఫా అవార్డుల వేడుకలో ప్రియాంక చోప్రా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

ఐపా అవార్డుల వేడుకలో దీపిక పదుకో పెర్ఫార్మెన్స్.... దీపిక రూ. 1.3 కోట్ల తీసుకున్నట్లు టాక్.

అనిల్ కపూర్, రణవీర్ సింగ్

అనిల్ కపూర్, రణవీర్ సింగ్

ఐఫా అవార్డుల వేడుకలో అనిల్ కపూర్, రణవీర్ సింగ్

సోనాక్షి

సోనాక్షి

ఐఫా అవార్డుల వేడుకలో సోనాక్షి సిన్హా డాన్స్ పెర్ఫార్మెన్న్.

ప్రియాంక

ప్రియాంక

బాజీరావు మస్తానీ మూవీ లోని పింగా సాంగుకు ప్రియాంక చోప్రా పెర్ఫార్మెన్స్.

స్పానిష్ డంకీ రైడ్

గాడిదలపై ఊరేగింపు వీడియో....

English summary
IIFA 2016 hosts Farhan Akhtar and Shahid Kapoor, aka Raju and Pappu, ditched the luxury cars for Spanish donkeys to hit the green carpet. The 17th edition of the IIFA awards gala, which takes the power of Bollywood to international shores every year, is celebrating 60 years of India’s diplomatic relations with Spain here with close to 150 film celebrities and over 20,000 fans in attendance
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu