twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు కేంద్రం కీలక పదవులు.. నేరుగా రాజ్యసభకు!

    |

    రాజ్యసభకు దక్షిణ గురించి నలుగురు ప్రముఖులు నామినేట్ అయినట్టు తాజాగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన నరేంద్ర మోడీ వారిని అభినందించారు. ఇక రాజ్యసభకు నామినేట్ అయిన దక్షిణాది ప్రముఖులు ఎవరంటే... దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్, పరుగుల రాణి పి.టి.ఉష, కర్ణాటక ధర్మశాల దేవస్థానానికి చెందిన ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే. ఆ వివరాల్లోకి వెళితే..

    దక్షిణాది నుంచి నలుగురికి

    దక్షిణాది నుంచి నలుగురికి


    దక్షిణాది నుంచి నలుగురికి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు బెయిల్ అవకాశం దక్కింది. ఇక ఈ నలుగురిలో ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు కావడం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి తండ్రిగా, పాపులర్ రచయితగా విజయేంద్రప్రసాద్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతో పాటు అందరికీ సుపరిచితమే. విజయ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో జన్మించారు. ఆయన కథా రచయితగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1988 నుంచి రచయితగా కొనసాగుతున్న ఆయన ముందుగా తన సోదరుడు దత్తాతో కలిసి కథలు రాసే వారు. కేవలం తెలుగు సినిమాలకే కాకుండా హిందీ, తమిళ భాషలో దొరికిన సినిమాలకు కూడా రచయితగా ఆయన పని చేశారు.

     రాజమౌళి సినిమాలకు

    రాజమౌళి సినిమాలకు


    తన కెరీర్లో నాలుగు సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. ఇక తర్వాత తన తనయుడు రాజమౌళి దర్శకుడుగా మారినప్పటి నుంచి, రాజమౌళి అన్ని సినిమాలకు కూడా విజయేంద్రప్రసాద్ స్వయంగా కథలో అందిస్తూ వస్తున్నారు. ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఆయనే కథ అందించారు. ఇక మాస్ట్రో ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 1970లో సంగీత దర్శకుడిగా మారిన ఆయన అనేక భాషల్లో ఎన్నో పాటలకు బాణీలు సమకూర్చారు.

    మ్యూజిక్ డైరెక్టర్ గా

    మ్యూజిక్ డైరెక్టర్ గా

    తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమాల్లో కొన్ని వందల పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు ఆయన. ఆయన మ్యూజిక్ లో తన ప్రత్యేక శైలితో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే నిజానికి ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నట్లు గత కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోడీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం.ఆయన తమిళనాడులోని తేని జిల్లా, పన్నైపురంలో రామస్వామి, చిన్నతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించాడు.

    పేరు మార్చుకుని

    పేరు మార్చుకుని

    ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. పాఠశాలలో చదువుతున్న సమయంలో తండ్రి అతని పేరును జ్ఞానదేశికన్ నుండి రాజయ్యగా మార్చారు. గ్రామంలోని స్నేహితులు రాజయ్యను రాసయ్య అని పిలవడంతో ఇళయరాజా తన పేరును రాజాగా మార్చుకున్నాడు. ఇళయరాజా మొదటి చిత్రానికి నిర్మాత అయిన పంచు అరుణాచలం ఈ పేరుకు ఇళయను జోడించి ఇళయరాజాగా మార్చారు. ఆనాటి ప్రసిద్ధ గాయకుడు, స్వరకర్త, A.M. రాజా పేరుతో పోలిక రాకుండా ఉండేందుకు పేరును ఇళయరాజాగా పెట్టారు.

    పద్మ అవార్డు కూడా

    పద్మ అవార్డు కూడా


    ఇక ఇళయరాజాకు ముగ్గురు కుమారులు కార్తీక్‌రాజా , యువన్‌శంకర్‌రాజా , భవతారాణి కాగా, వారు కూడా సంగీత రంగంలోనే ఉన్నారు. తన సుదీర్ఘ కెరీర్లో ఇళయరాజా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నారు. నాలుగు సార్లు భారత ప్రభుత్వ జాతీయ అవార్డులు అందుకున్నారు. పద్మభూషణ్ అవార్డు కూడా ఆయనను వరించిన విషయం తెలిసిందే.

    English summary
    Ilaya Raja, vijayendra Prasad gets nominated to rajya sabha
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X