»   » 'రామయ్యా వస్తావయ్యా’: ఇళయరాజా ఫ్యాన్స్ కు పండుగ

'రామయ్యా వస్తావయ్యా’: ఇళయరాజా ఫ్యాన్స్ కు పండుగ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్'రాజు నిర్మిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' . ఈ చిత్రం తో ఇళయరాజా అభిమానులకు పండుగ చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఇళయరాజా సూపర్ హిట్స్ పాటలు కొన్నిటిని ఈ చిత్రంలో వాడనున్నారు. హీరో తన ప్రేయసి కోసం రేడియోలో ఈ పాటలను అడిగి ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్వీట్ ద్వారా తెలియచేసారు. ఇళయరాజా అభిమానులు సర్పైజ్ అవుతారని అన్నారు.

ఇక ఈ చిత్రం సాంగ్ ప్రోమోని గత నెల 31న విడుదల చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే పది లక్షల మంది ఈ ప్రోమోని చూసి డిజిటల్ రికార్డ్ ని నమోదు చేసారు. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేసారు. నిర్మాత రాజు మాట్లాడుతూ ' సాంగ్ ప్రోమోని విడుదల చేసిన మూడు రోజులకే యూట్యూబ్ ఛానల్‌లో పది లక్షల మంది చూడటంతో ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజిటల్ రికార్డ్ నమోదయింది. హీరోల కేరెక్టరైజేషన్స్‌ని విభిన్నంగా చూపించే దర్శకుడు హరీశ్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్స్‌లో విజిల్స్ వేసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ' అన్నారు.

'దిల్' రాజు మాట్లాడుతూ -''ఎన్టీఆర్ కథ అంటే మాస్ మెచ్చాలి. మా సంస్థ నుంచి వచ్చే సినిమా కథంటే... అన్ని వర్గాలవారికీ నచ్చాలి. అందుకు తగ్గట్టే 'రామయ్యా వస్తావయ్యా' కథ ఉంటుంది. 'బృందావనం' ఎన్టీఆర్‌కి ఎంత మంచి పేరు తెచ్చిందో.... అంతకు పదింతలు పేరు తెచ్చే సినిమా ఇది. హరీష్‌శంకర్ అద్భుతం అనిపించే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఎన్టీఆర్ పాత్రను ఆయన మలిచిన తీరు చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమాతో హరీష్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. తమన్ శ్రావ్యమైన స్వరాలందించాడు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేస్తాం'' అని చెప్పారు.

ఎన్టీఆర్‌తో తనకిది హ్యాట్రిక్ హిట్ అవుతుందని తమన్ నమ్మకం వ్యక్తం చేశారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించే పాట రాశానని అనంతశ్రీరామ్ చెప్పారు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారని స్క్రీన్‌ప్లే రచయిత రమేష్‌రెడ్డి అన్నారు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ముఖేష్‌రుషి, రవిశంకర్, రావురమేష్, అజయ్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

English summary
NTR starrer Ramayya Vastavayya will have a surprise element for Ilayaraja fans. The film will have a medley of all Ilayaraja's hit romantic numbers. The scene is NTR strolling with his lady love when these popular romantic songs will be played on the radio. Director Harish Shankar tweeted that Ilayaraja fans will get a surprise in the film Ramayya Vastavayya. Meanwhile, the film's new teaser has just set a new record on Youtube for the fastest 1 Million views for a Telugu movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu