»   » హ్యాపీ బర్త్ డే ఇళయరాజా: కటిక పేదరికం నుండి మ్యూజిక్ లెజెండ్‌గా...

హ్యాపీ బర్త్ డే ఇళయరాజా: కటిక పేదరికం నుండి మ్యూజిక్ లెజెండ్‌గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దు:ఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసును తాకితే ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో వినసొంపైన స్వరాలను ఏరి కూర్చి పాటల మాలను కట్టే మ్యూజిక్ మ్యాస్ట్రో పద్మభూషన్ ఇళయరాజా పుట్టినరోజు ఈ రోజు. నేటితో 73వ ఏట అడుగుపెడుతున్నారు. స్వతహాగా నిరాండబరంగా ఉండే ఇళయరాజా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటారు.

1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో జన్మించిన ఇళయరాజ ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన నేడు భారతదేశ సంగీత ప్రముఖ దర్శకులలో ఒకరిగా ఎదిగారు..1976లో విడుదలైన జయప్రద నటించిన 'భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని 'చిన్ని చిన్ని కన్నయ్య" అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేసారు. తెలుగులో 'భద్రకాళి'కి తొలిసారి సంగీత దర్శకత్వం వహించినా, ఎన్టీఆర్‌ నటించిన 'యుగంధర్‌' మొదట విడుదలయింది.

Ilayaraja turns 73

నిత్య సంగీత సాధకుడుగా మన సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం ఆయనకు అలవాటు అయింది. దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన సంగీత నటరాజు ఇళయరాజ. ఇళయరాజ మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకోవడమేకాక, 2004లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

ఇళయరాజ సంగీతం వింటుంటే ఎవరైనా సరే తన్మయత్వం అయిపోవాల్సిందే. అంతటి ఘనత ఆయనది. ఆయన ఇప్పటి వరకు వేల పాటలకు, వందలాది చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన సుస్వరాలో తేలియాడని సంగీతాభిమాని ఉండరనడంలో అతిశయోక్తి కాదేమో! మరి ఆయన పుట్టిన రోజు సందర్బంగా వన్ ఇండియా, ఫిల్మీబీట్ తెలుగు తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

English summary
Ilaiyaraaja is an Indian film composer who works predominantly in the South Indian cinema since the late 1970s. Regarded as one of the finest music composers in India, Ilaiyaraaja is also an instrumentalist, conductor, singer, and a songwriter. Ilayaraja was born on 2nd June in 1943. Happy b'day Ilayaraja.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu