»   » బ్రేకప్ రూమర్స్: అతనితో సంబంధంపై ఇలియానా స్పందన

బ్రేకప్ రూమర్స్: అతనితో సంబంధంపై ఇలియానా స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ ఇలియానా గత కొంత కాలంగా ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆండ్రూ ఇపుడు ముంబైలో కనిపించడం లేదు. ఆస్ట్రేలియా వెళ్లి పోయాడు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందనే వార్తలు తెరపైకి వచ్చాయి.

ఈ వార్తలపై ఇలియానా స్పందించింది. ఆండ్రూతో తన రిలేషన్ షిప్ ఇంకా కొనసాగుతోందని, ముఖ్యమైన పని మీద ఆండ్రూ ఆస్ట్రేలియా వెళ్లాడని తెలిపింది. ప్రస్తుతం ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా అతనితో కాంటాక్టులోనే ఉన్నట్లు ఇలియానా తెలిపింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఇలియానా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

Ileana about Andrew Kneebone

ప్రస్తుతం ఇలియానా షారుఖ్ ఖాన్ తో కలసి ‘ఫ్యాన్' అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఇలియానా పరిస్థితి బాలీవుడ్లో అనుకున్న స్థాయిలో సాగడం లేదు. సౌత్ లో ఉన్నపుడు నెం.1 హీరోయిన్ గా వెలుగు వెలిగింది. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందట.

Ileana about Andrew Kneebone

త్వరలో రామ్ చరణ్ తమిళ హిట్ మూవీ ‘థాని ఓరువన్' తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో ఇలియానాను కూడా తీసుకునే ప్రతి పాదన కూడా ఉన్నట్లు సమాచారం. పలువురు తమిళ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇలియానాను తమ సినిమాల్లో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే దీని గురించి ఇలియానా ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు.

English summary
Rumors about Ileana D’Cruz breaking up with her longtime boy friend Andrew Kneebone. But Ileana stated that she is very much in relation with the Australian photographer Andrew Kneebone.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu