»   » ఆ తెలుగు హీరో ప్రేమించానని మోసం చేసాడు: ఇలియానా

ఆ తెలుగు హీరో ప్రేమించానని మోసం చేసాడు: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఇలియానా ప్రేమ పేరుతో మోసపోయిన విషయం మరోసారి మీడియాకి ఎక్కింది. నేను ఒక తెలుగు హీరోని ప్రాణంకంటే ఎక్కువ ప్రేమిస్తే మోసం చేశాడు అని మరోసారి చెప్పింది ఇలియానా. ఈమె గతంలో కూడా ఇలానే చెబితే... దాన్ని రూమర్స్‌ అని కొందరూ, కాదు నిజమే అంటూ మరికొందరు హడావుడి చేశారు. అయితే ఇసారి మాత్రం ఇంకాస్త ఎక్కువగానే చెప్పుకొచ్చింది ఇలియానా.

రీసెంట్ గా ఆమెను హిందీ సినిమా ప్రమోషన్ లో భాగంగా...మీరు ఎప్పుడు ఎవరో ఫారిన్‌ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్నారటగా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ''నేను నా జీవితంలో అంత తొందరగా ఎవ్వరినీ రానివ్వను. ఒకసారి మోసపోయాను కాబట్టి, ఈసారి ఎలా ఉండాలో నాకు తెలుసు'' అని ఖచ్చితంగా చెప్పేసింది. తెలుగు హీరోలపై అనుమానపు బాణాలు సంధించింది.

అలాగే...''అప్పట్లో తెలుగులో లో చేస్తున్నప్పుడు ఒక హీరోకు మనసిచ్చాను. అతనే నా సర్వస్వం అనుకున్నా. కానీ అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. నన్ను మోసం చేశాడు'' అంటూ బాధపడుతూ చెప్పుకొచ్చింది ఇలియానా. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం రివిల్ చేయలేదు. అంతేకాదు...'తెలుగు సినిమాలను సీరియస్‌గా తీసుకోలేదు. కాని నా 7వ సినిమా నుంచి మాత్రం అద్భుతంగా చేశాను.'' అంది. ఆమె 7వ సినిమా ఎమ్మెస్‌రాజు తీసిన ఆట. అందులో హీరో సిద్దార్ధ.

అందం విషయంలో ఇలియానాను తలదన్నే హాట్ బ్యూటీస్ తెరంగ్రేటం చేయడంతో రాను రాను సౌత్‌‌లో ఇలియానా అందాలకు గిరాకీ తగ్గడం మొదలైంది. దీనికి తోడు వరుస ప్లాపులు కూడా ఇలియానా ఇమేజ్‌ను తగ్గించేసాయి. ఇదే సమయంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయి అక్కడ బిజీ అయిపోయింది ఈ గోవా బ్యూటీ. ఇలియానా నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'బర్పీ' హిట్టవడం కలిసొచ్చింది. ఇప్పుడు పలు చిత్రాల్లో బిజీగా గడుపుతోంది. అయితే దక్షిణాదిన ఉన్నపుడు ఇలియాన లుక్‌కి...ఇపుడు బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత ఇలియానా లుక్‌కి చాలా తేడా వచ్చింది. నిండైన అందాలను కోరుకునే సౌత్ ప్రేక్షకులు....ఇప్పుడు బాలీవుడ్లో ఇలియానా మరింత బక్కపలుచగా మారడాన్ని ఇష్ట పడటం లేదు.

English summary
"The need of the hour is to be brave, sensible and alert. I like to believe that I am street smart. But I am incredibly wary now. I have bolts on the door with solid locking system. I am careful where I go and I don't step out too much in the night," Ileana says.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu