»   » ప్రమాదం నుంచి ఇలియానాని కాపాడాడు..లేకపోతే

ప్రమాదం నుంచి ఇలియానాని కాపాడాడు..లేకపోతే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తెరమీద హీరోయిన్ ని కాపాడటానికి హీరోలు చేసే సాహసాలకు అంతే ఉండదు. అయితే నిజ జీవితంలోనూ ఒక్కోసారి హీరోయిన్స్ కు సమస్య వస్తే హీరోలు రంగంలోకి దూకేస్తూంటారు. ఆ ప్రమాదాల నుంచి వారిని కాపాడేసి రియల్ హీరో అనిపించుకుంటూంటారు. ఇప్పుడు అలాగే కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లో కూడా ఇలియానాని కాపాడేసి రియల్ హీరో అనిపించుకున్నాడు అక్షయ్ కుమార్.

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ చిత్రం రుస్తుంలో నటిస్తోంది. అందులో హీరో అక్షయ్ కుమార్. ఇందులో భర్త అక్షయ్ ను మోసం చేసే భార్యగా ఇలియానా నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఇప్పుడు ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా ఇలియానా హార్స్ రైడింగ్ చేయాల్సి ఉంటుంది.

అందుకోసం ఇలియానా గుర్రం ఎక్కింది. అయితే ఇలియానా ఎక్కిన గుర్రం కంట్రోల్ తప్పి విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీనితో వెంటనే అలర్ట్ అయిన అక్షయ్ కుమార్.. ఎంతో జాగ్రత్తగా ఆ గుర్రాన్ని డీల్ చేసి.. దాన్ని శాంతపరిచి నడిపించుకుంటూ సేఫ్ గా తీసుకొచ్చాడు. అదే ఇలియానా గుర్రం మీద నుంచి పడిపోతే పరస్దితి చాలా ఇబ్బందిగా ఉండేదని, డాక్టర్స్, రెస్ట్, షూటింగ్ కాన్సిల్ వంటివి జరిగేవంటున్నారు.

గుర్రంపై ఇలియానా.. పక్కనే గుర్రాన్ని పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తూ జాకీలా కనిపిస్తున్నా.. విజువల్ అదిరిపోయిందంటోంది బాలీవుడ్. అయితే అనుకోకుండా దొరికిన ఈ క్లిప్పింగ్ మొత్తాన్ని జాగ్రత్తగా షూట్ చేశాడట దర్శకుడు టిన్ సురేష్ దేశాయ్. మూవీ రిలీజ్ అయ్యాక ఫైనల్ కట్ లో కూడా ఈ సీన్ ఉంటుందని తెలుస్తోంది. దాంతో నిజంగానే జరిగిందా లేక ముందే ఇలాగే ప్లాన్ చేసారా అనే డౌట్స్ కూడా జనాలకు వస్తున్నాయి.

ఇలియానా మాట్లాడుతూ..."అక్షయ్ తో పని చేయడం చాలా గొప్పగా అనిపించింది. అయ్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరో. అతనో సూపర్ స్టార్. అందులో సందేహమే లేదు. ఇక అతడి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నటనలోనూ అక్షయ్ సూపర్ స్టారే. అతడి యాక్టింగ్ స్కిల్స్ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడక పోవటం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది" అంటూ అక్షయ్ ని తెగ మోసేసింది.

ఇక రుస్తుం సినిమాలో నటించిన అనుభవం గురించి చెబుతూ.. "ఓ సినిమా పూర్తయ్యాక నేను పెద్దగా ఎమోషనల్ అవను. కానీ ఈ సినిమా పూర్తయినపుడు మాత్రం చాలా బాధగా అనిపించింది. ఇంత భారీ సినిమాను ఇంత త్వరగా ఎందుకు పూర్తి చేసేశారో అనిపించింది. మళ్లీ ఈ సినిమా సెట్లోకి వెళ్లలేనన్న విషయం తెలిసి ఏడుపొచ్చేసింది" అంటూ అక్షయ్ ని మరీ మరీ అదే పని అన్నట్టుగా పొగిడింది.

ఇలియానా పర్శనల్ లైఫ్ విషయాలకి వస్తే...

లవ్ ఎఫైర్

లవ్ ఎఫైర్

ఇలియానా...ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో చాలా కాలంగా లవ్ ఎఫైర్ సాగిస్తోంది .

సహజీవనం

సహజీవనం

ప్రస్తుతం వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మార్చుకుంటోంది

మార్చుకుంటోంది

తన లవర్ ...ఇష్టాలు, ఆలోచనలకు అనుగుణంగా తన దృక్పథంలో మార్పులు చేసుకుంటోంది ఇలియానా.

లవర్ తోటే

లవర్ తోటే

ఇలియానా ప్రస్తుతం తన లవర్ అడుగుజాడల్లోనే నడుస్తోంది.

పట్టింపులు లేవు

పట్టింపులు లేవు

అందం విషయంలో ఆండ్రూకు ఎలాంటి పట్టింపులు లేవని, తాను ఎలా ఉన్నా ఆరాధిస్తాడని అంటోంది.

ప్రేమ తగ్గదు

ప్రేమ తగ్గదు

నేను ఎలా ఉన్నా, నాపట్ల ఆండ్రూ చూపించే ప్రేమ కొంచెం కూడా తగ్గదని అంటోంది ఇలియానా

మేకప్ లేకపోయినా

మేకప్ లేకపోయినా

ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ నాకు మేకప్ వున్నా లేకపోయినా తను ఇష్టపడతాడు.

ఇష్టం..

ఇష్టం..

నేను ఎలా వున్నా నా మొహాన్ని చూడటం అతడికి చాలా ఇష్టం.

డీగ్లామర్ ని సైతం

డీగ్లామర్ ని సైతం

నాలోని గ్లామర్‌నే కాదు...డీగ్లామర్‌ను కూడా ఆండ్రూ ఇష్టపడతాడు.

అప్పుడు కూడా అందగత్తననే

అప్పుడు కూడా అందగత్తననే

జుత్తు రేగిపోయినా కూడా అందంగానే ఉన్నానని ప్రశంసలు కురిపిస్తాడు.

బాగుందంటాడు

బాగుందంటాడు

నేను ఎలాంటి డ్రెస్‌వేసినా బాగుందని కితాబిస్తాడు అంటూ గోవా సుందరి ఇలియానా ప్రియుడి గొప్పతనాన్ని అభివర్ణించింది.

నో ప్లాన్స్..

నో ప్లాన్స్..

అండ్రూతో పెళ్లి గురించి ప్రశ్నిస్తే మాత్రం నేను ప్రణాళిక ప్రకారం పనులు చేయను అంది

టైం రావాలి

టైం రావాలి

ఒకరిని ఇష్టపడితే...వెంటనే పెళ్లాడాలనే రూలేం లేదు. దేనికైనా టైమ్ రావాలి అంటూ సమాధానం దాటవేసింది.

సహజీవనమే

సహజీవనమే

ఇలియానా ధోరణి చూస్తుంటే ఆండ్రూతో ఆమె సహజీవనం చేస్తున్నది నిజమేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అవన్నీ అబద్దాలే

అవన్నీ అబద్దాలే

గతంలో నేను బాలీవుడ్ నటుడితో డేటింగ్ చేస్తున్నానని పుకార్లు షికారు చేయగా అవన్నీ అసత్యాలు అని ఈ భామ పేర్కొంది.

సంతోషంగా

సంతోషంగా

తనకు లవర్ ఉన్న మాట నిజమేనని తెలుపుతూ, తన లవర్ తో తాను సంతోషంగా ఉంటున్నట్టు ఇల్లీ తెలిపింది.

సై అంటోంది

సై అంటోంది

ఒకప్పుడు బికినీకి, లిప్ లాక్ కి నో అన్న ఇలియానా ఆమధ్య అందుకు కూడా రెడీ అని చెప్పేసింది.

తగ్గించి ఇచ్చినా ..

తగ్గించి ఇచ్చినా ..

టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసిన ఇలియానా ఇప్పుడు వేషాలు లేకపోవడంతో దిగాలు పడి, రెమ్యునేషన్ తో సంభందం లేదంటోంది.

అలా చేద్దామంటే

అలా చేద్దామంటే

అదివరకు తనకు ఛాన్సులు ఇచ్చిన డైరెక్టర్ల దగ్గరికి వెడదామా అంటే వాళ్లంతా హీరోల చుట్టూ తిరుగుతున్నారు. ఇంక ఇలా లాభం లేదని ఇలియానా తన రెమ్యునరేషన్ ను సగానికి సగం తగ్గించేసినట్టు చెబుతున్నారు.

చెప్తోంది కానీ

చెప్తోంది కానీ

తను రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్టు ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు ఈ సంగతి ఫోన్ చేసి మరీ చెబుతోందట ఇల్లీ. కానీ ఆమె రీ ఎంట్రీకి ఎవరూ ఆహ్వానం పలకుతున్నట్లు కనపడటం లేదు

English summary
Akshay Kumar literally proved to be the knight in shining armour for his co-star Ileana D'Cruz while they were shooting a horse-riding scene for their upcoming film, 'Rustom'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu