For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిర్మాతపై కేసు పెట్టనున్న ఇలియానా, ఆ వీడియోనే కారణం

  By Srikanya
  |

  ముంబయి: ఇలియానా తనతో పద్దతిగా ఉంటే చాలా పద్దతిగా ఉంటాను..లేదంటే కేసులు పెట్టి మరీ కోర్టుకు ఈడుస్తాను అంటోంది. ఆమె కోపానికి కారణం ఓ వీడియో ఆమె అనుమతి లేకుండా ప్రదర్శించటమే అని చెప్తున్నారు. ఆమెకు అంతలా కోపం వచ్చే ఆ వీడియోలో ఏముందో..మీరు ఈ క్రింద చదవండి.

  పూర్తి వివరాల్లోకి వెళితే... బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌, అర్జున్‌ రాంపాల్‌లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆంఖే. 2002లో ఈ చిత్రం విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్టై, నిర్మాతలకు డబ్బు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా ఆంఖే-2 రాబోతోంది.

  ఈ సీక్వెల్ చిత్రంలో అమితాబ్‌, అర్షద్‌ వార్సిలు ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. గురువారం ముంబయిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ చిత్రం విశేషాలను నిర్మాత గౌరంగ్‌ దోషి వెల్లడించారు. ఇందులో ఇలియానా కూడా నటించనున్నట్లు చెప్పారు. అయితే అక్కడే కథ మలుపు తిరిగింది. ఇలియానాకు కోపం వచ్చింది. అసలేం జరిగింది. వీడియో సంగతేంటి క్రింద చదవండి

  మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...

  కానీ వాస్తవానికి ...

  కానీ వాస్తవానికి ...

  ఈ సినిమా కోసం ఇలియానాను సంప్రదిస్తే ఆమె ఒప్పుకోలేదట.

  అయినా...

  అయినా...

  ఆంఖే 2 చిత్రంలో ఇలియానా కూడా నటిస్తోందని దర్శకుడు వెల్లడించారు. ఆ సమయంలో ఇలియానా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

  వీడియో సైతం

  వీడియో సైతం

  ఆమె తమ సినిమాకు సైన్ చేయకపోయినా ఇలియానాకి సంబంధించిన వీడియో ఒకటి ఈవెంట్‌లో ప్రదర్శించారు.

  అందుకే కోపం

  అందుకే కోపం

  అనుమతి లేకుండా ఈ సినిమాలో ఇలియానా కూడా నటిస్తోందని ప్రకటించడంతో ఇలియానాకి కోపం వచ్చింది.

  ఇదే విషయమై

  ఇదే విషయమై

  దీంతో చిత్ర యీనిట్ పై కేసు పెట్టనుందని బాలీవుడ్‌ టాక్‌. ఈ మేరకు ఆమె లాయిర్లని కలుస్తోందని తెలుస్తోంది.

  అలా తెలిసింది

  అలా తెలిసింది

  ఆంఖే-2లో అమితాబ్‌తో నటించే అవకాశం వచ్చినందుకు అందరూ విషెస్‌ చెప్పడంతో ఇలియానాకి ఈ విషయం తెలిసింది

  మేనేజర్

  మేనేజర్

  దాంతో నిర్మాత గౌరంగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనుందని ఇలియానా మేనేజర్‌ తెలిపారు.

  సైలెంట్

  సైలెంట్

  ఈ విషయంపై గౌరంగ్‌ కూడా మీడియాకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

  ఎందుకిలా

  ఎందుకిలా

  ఇలా నిర్మాతలు లావిష్ గా ఫంక్షన్ చేసి, మీడియాలో వార్తలు వచ్చేలా చేయటం కేవలం ఫైనాన్సియర్స్ కోసమే అంటున్నారు

  మనీగేమ్

  మనీగేమ్

  ఇలియానా, అక్షయ్ కుమార్ కాంబినేషన్ రుస్తుం వచ్చింది కాబట్టి అదే కాంబినేషన్ ఎనౌన్స్ చేస్తే ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారని నిర్మాత ఆలోచనగా చెప్తున్నారు.

  చేసినా, చెయ్యకపోయినా

  చేసినా, చెయ్యకపోయినా

  ఇలా సినిమాలు ఎనౌన్స్ చేస్తే , ఆ సినిమా చేసినా, చెయ్యకపోయినా ముందు ఇన్విస్టర్స్ డబ్బుతో నిర్మాత జేబులు నిండుతాయని అంటున్నారు

  పట్టించుకోరనే

  పట్టించుకోరనే

  కేవలం సీక్వెల్ ప్రకటిస్తే ఎవరూ పట్టించుకోరనే ఇలా ఆర్టిస్ట్ ల పేర్లు, వీడియోలతో సినిమాని ఎనౌన్స్ చేసారంటున్నారు.

  అడ్వాన్స్ ఇచ్చి

  అడ్వాన్స్ ఇచ్చి

  అడ్వాన్స్ లు ఇచ్చి ఎగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆర్టిస్టుల పేర్లు ప్రకటిస్తే బాగుంటుంది కానీ ఇదిపద్దతి కాదంటున్నారు

  లాభమే అన్నా

  లాభమే అన్నా

  కొందరేమో ఇలా ఓ భారీ చిత్రంలో ఇలియానా ఉందని ప్రకటన వస్తే లాభమే అవుతుందని వాదిస్తున్నారు

  కానీ నష్టం

  కానీ నష్టం

  కానీ సినిమా కమిటవ్వకుండా కేవలం ఫలానా సినిమాలో చేస్తున్నారని ప్రచారం జరిగితే బిజీగా ఉందని ఆ ఆర్టిస్టుల జోలికి ఎవరూ రారు..ఇది నటుల కెరీర్ కు పెద్ద దెబ్బ

  అసలే ..

  అసలే ..

  రుస్తుం చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇలియానా , ఆ సినిమా అంతంత మాత్రం కావటంతో నిరాశలో ఉందిట

  దక్షిణాది నుంచి నో

  దక్షిణాది నుంచి నో

  దానికి తోడు మొదటినుంచీ ఆమెను ఆదరిస్తూ వస్తున్న దక్షిణాది పరిశ్రమ నుంచిసైతం ఆమెకు ఆఫర్స్ రావటం లేదు

  బాలీవుడ్ లో

  బాలీవుడ్ లో

  బాలీవుడ్ లో నిలదొక్కటానికి అన్నిప్రయత్నాలు చేస్తోంది ఇలియానా కాని కలిసి రావటం లేదు

  బోయ్ ఫ్రెండ్ తో

  బోయ్ ఫ్రెండ్ తో

  ఆమెకు సినిమాల మీద కన్నా బోయ్ ఫ్రెండ్ తో కనపడటం లోనే ఎక్కువ ఆసక్తి ఉందని బాలీవుడ్ మీడియా వ్యాఖ్యానాలు చేస్తోంది

  కేసు పెడుతుందా

  కేసు పెడుతుందా

  ఆంఖే 2 నిర్మాతపై కేసు పెడుతుందా లేక కేవలం బెదిరింపేనా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

  English summary
  Ileana D’Cruz is considering legal action against producer for claiming she was doing Aankhen 2
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X