For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ ఇలియానా గుర్రం సవారి(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: సౌత్ సినిమాలకన్నా బాలీవుడ్ మిన్న అని భావించి అటువైపు అడుగులు వేస్తూ బిజీ అవుతున్న భామ ఇలియానా. ఆమె తాజాగా 'Phata Poster Nikla Hero' చిత్రం చేస్తోంది. అందులో ఆమె గుర్రం ఎక్కుతోందో లేదో కానీ... సినిమా ప్రమోషన్ కోసం మాత్రం గుర్రం ఎక్కి తిరిగి అందరి దృష్టినీ ఆకర్షించింది.

  'Phata Poster Nikla Hero' చిత్రం పూర్తి మాస్ మసాలా బాలీవుడ్ ఎంటర్‌టైర్‌గా రూపొందిస్తున్నారు. సూపర్ స్టార్స్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగే యంగ్ బాయ్స్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామెడీ. ఆగస్టు 23న విడుదలయ్యే ఈ చిత్రం విజయంపై ఇలియానా బాలీవుడ్ భవిష్యత్ ఆధారపడి ఉంది.

  ''తెలుగులో సినిమాలు తగ్గాయన్న బాధ నాకు లేదు. కానీ తెలుగు సినిమాను ఎప్పుడూ నేను అభిమానిస్తూనే ఉంటాను. నా ఏడేళ్ల కెరీర్‌లో ఇంతవరకూ నా కారణంగా డిలే అయిన సినిమా ఒక్కటీ లేదన్నది నిజం. నాకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అవివేరొకర్ని బాధ కలిగిస్తే నేనేం చేయలేను కదా'' అంటూ తేల్చి చెప్పింది ఇలియానా.

  ఒకే వారం గ్యాప్ లో ఇలియానా నటించిన రెండు చిత్రాలు('జులాయి','దేవుడు చేసిన మనుషులు') విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు ఆమెకు ఊహించినంత కిక్ ఇవ్వలేదు. దేముడు చేసిన మనుష్యులు ఆల్రెడీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. జులాయి కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకున్నా ఆమెకు త్రివిక్రమ్ కరువు కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్ చేసి మరీ అలాగే చూపెట్టాడు. దాంతో ఆమెకు తెలుగులో ఊహించిన క్రేజ్ రాలేదు. దాంతో ఇలియానా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

  రాజ్‌ కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘Phata Poster Nikla Hero'లో ఇలియానా పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేసారంటున్నారు.

  ఈ రొమాంటిక్ కామెడీలో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. ఇలియానా,షాహిద్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయంటున్నారు.

  బర్భీ.. ఇలియానాకు మంచి నటిగా బాలీవుడ్ లో పేరు తెచ్చినా కెరీర్ మాత్రం ఈ చిత్రం ఇస్తుందంటోంది.

  ఈ చిత్రం గురించి ఇలియానా మాట్లాడుతూు... సినిమా చాలా బాగా వచ్చింది. నిజంగా నా కెరిర్ లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది అంటోంది.

  దర్శకుడు రాజకుమార్ సంతోష్ గురించేతే చెప్పక్కర్లేదు..అద్బుతం అని పొగుడుతోంది ఇలియానా.

  ఈ సినిమాలో పద్మిని కొల్హాపురి కూడా ఓ కీ రోల్ చేస్తోంది.

  ఈ సినిమాని ఆగస్టు 23న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

  ప్రస్తుతం ఇలియానా దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే పెట్టింది.. సాధారణంగా మంచి సక్సెస్‌ ఉంటేనే ఇక్కడ ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. అలాంటిది వరసగా ఫెయిల్యూర్ లో ఉన్న ఆమె సన్నబడి మరీ అందం కూడా లేకుండా పోవటం ఆమెకు మైనస్ గా మారింది.

  ‘జులాయి' లాంటి హిట్ తర్వాత ఆమెకు ఆఫర్స్ వచ్చినా తిరస్కరించిందని తెలుస్తోంది. మరో ప్రక్క ఆమె తెలుగులో తమన్నా, సమంత, కాజల్‌తో విపరీతమైన పోటీని ఎదుర్కొంటోంది.

  బాలీవుడ్ లో వచ్చే రెమ్యునేషన్స్ తో పోలిస్తే టాలీవుడ్ లో తక్కువే కాబట్టి.. అక్కడే సేఫ్ అని ఇలియానా భావిస్తోంది. ఈ సినిమా హిట్టైతే అక్కడ ఆమెకు తిరుగేలేదు.

  English summary
  After starting her Bollywood career on a high note with Barfi!, actress Ileana D'Cruz is glad with the way her next Hindi film Phata Poster Nikla Hero is shaping up. Check the latest horse riding stills of Indian actress Ileana D'Cruz from Shahid Kapoors upcoming hindi movie Phata Poster Nikla Hero. Raj Kumar Santoshi is directing this movie. This is second movie for Ileana in bollywood and she wants to cement her place in bollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X