»   »  చిరంజీవి, రామ్ చరణ్ ఇష్యూ.... అలాంటిదేం లేదన్న ఇలియానా!

చిరంజీవి, రామ్ చరణ్ ఇష్యూ.... అలాంటిదేం లేదన్న ఇలియానా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ-ది ఫైటర్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తుండటం మరో విశేషం. ఈ చిత్రంలో చిరంజీవి ఓ పాటలో స్టెప్స్ కూడా వేయబోతున్నారు.

రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ కలిసి ఓ ఐటం సాంగులో స్టెప్స్ వేస్తారని, హీరోయిన్ ఇలియానాతో ఈ ఐటం సాంగు ఉంటుందని, ఇందుకోసం ఆమెకు రూ. 1.5 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలను ఇలియానా ఖండించింది. తాను ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం లేదని స్పష్టం చేసింది.

రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించే సాంగులో ఎలాంటి ఫిమేల్ అట్రాక్షన్ ఉండదని, ఇదొక ఎంజాయబుల్ సాంగ్ మాత్రమే అని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తన కెరీర్లోనే ది బెస్ట్ మ్యూజిక్ అందించేందుకు తమన్ కృషి చేస్తున్నాడు.

Ileana Not Playing An Item In Ram Charan's Bruce Lee

తమన్ ట్వీట్ చేస్తూ... "సూపర్ ఎక్సైట్మెంట్ గా ఉంది... మెగాస్టార్ గారి పాటకు తొలిసారి కంపోజ్ చేయబోతున్నందుకు... బ్రూస్ లీ చిత్రం కోసం చేస్తున్నా.. :) గాడ్ బ్లెస్ :) అన్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి తన నిజజీవిత పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో కథలో భాగంగా.... చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రానికి రామ్‌చరణ్‌ ఫైట్స్‌ కంపోజ్‌ చేస్తూ కనపడతాడు. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట. ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్‌ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు.

English summary
Putting the reports in to trash, Ileana denied doing an item number in Ram Charan's Bruce Lee, directed by Sreenu Vaitla. Initial reports suggested that Ileana will be shaking a leg with Chiranjeevi and Ram Charan in a special song.
Please Wait while comments are loading...