»   » సల్మాన్‌తో రొమాన్స్ చేయబోతున్న ఇలియానా?

సల్మాన్‌తో రొమాన్స్ చేయబోతున్న ఇలియానా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సౌత్ సెన్షేషన్ స్టార్ ఇలియానా బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బిటౌన్ లో చేసిన తొలి సినిమా హిట్ కావడంతో ఇలియానా దశ తిరిగింది. వెను వెంటనే మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకుంది ఈ సన్ననడుము సుందరి.

షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన 'పతా పోస్టర్ నిక్లా హీరో' అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మే తేరా హీరో' చిత్రంలో చేస్తోంది ఇలియానా.

తాజాగా ఇల్లూ బేబీకి మరో భారీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా ఎంపికయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో రూపొందే 'బడే భయ్యా' చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఇంకా ఫైనల్ కాలేదంటున్న దర్శకుడు

ఇంకా ఫైనల్ కాలేదంటున్న దర్శకుడు


అయితే ఇదే విషయమై బడే భయ్యా దర్శకుడు సూరజ్‌ను బాలీవుడ్ మీడియా సంప్రదించగా....అది నిజం కాదు, ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. టైటిల్ కూడా ‘బడే భయ్యా' కాదు. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని తెలిపారు.

ఇలియానా స్పోక్ పర్సన్ మాట్లాడుతూ..

ఇలియానా స్పోక్ పర్సన్ మాట్లాడుతూ..


మరో వైపు ఇలియానా స్పోక్ పర్సన్ కూడా సల్మాన్ సినిమాలో ఇలియానా ఎంపికయినట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. సూరజ్ దర్శకత్వంలో వచ్చే సినిమా గురించి మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదని వివరణ ఇచ్చారు.

కావాలనే విషయాన్ని దాస్తున్నారు

కావాలనే విషయాన్ని దాస్తున్నారు


అయితే బాలీవుడ్లో మరో ప్రచారం కూడా సాగుతోంది. కావాలనే సల్మాన్-సూరజ్-ఇలియానా మూవీ విశేషాలపై గోప్యత పాటిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే దీనికంటే ముందు బోణీకపూర్ సల్మాన్‌తో ‘నో ఎంట్రీ' మూవీకి సీక్వెల్ తీసే ప్లాన్లో ఉన్నారట.

తెలుగు సినిమాతో తెరంగ్రేటం

తెలుగు సినిమాతో తెరంగ్రేటం


తెలుగులో వచ్చిన ‘దేవదాసు' చిత్రం ఇలియానా హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా అవార్డుకు కూడా అప్పట్లో అందుకుంది. ఆ తర్వాత స్టార్ సౌతిండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

పోకిరితో దశ తిరిగింది

పోకిరితో దశ తిరిగింది


ఇలియానా తన కెరీర్లో చేసిన రెండో సినిమా ‘పోకిరి'. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇలియానాకు తెలుగులో తిరుగులేకుండా పోయింది. దాదాపు 15 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. బర్ఫీ సినిమాతో బాలీవుడ్లో మకాం వేసింది అక్కడా దూసుకెలుతోంది.

English summary

 South sensation star Ileana D'Cruz is likely to sizzle in B-Town again. The latest buzz around the Barfi actress is that the Goan beauty has signed a movie, which will featuring none other than a Bollywood superstar. Well, The actress will be reportedly working with Salman Khan in a forthcoming Hindi movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu