»   »  ఇలియానా స్టైల్ లుక్ అదిరింది కదూ(ఫొటో)

ఇలియానా స్టైల్ లుక్ అదిరింది కదూ(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఇలియానా ఎప్పటికప్పుడు తన స్టైల్స్ ని మార్చుకుంటూ అందరినీ ఆకట్టుకునే పనిలో బిజీగా ఉంది. గతంలో ఎప్పుడూ స్టైల్ కి ప్రయారిటీ ఇవ్వని ఇలియానా ఇదిగో ఇలా ప్రముఖ స్టైల్ డిజైనర్ చేతిలో పడి ఈ స్టైల్ తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంటోంది. శశి మెబ్రా ఫ్యాషన్ స్టైలిస్ట్ ఈమెను ఇలా తీర్చిదిద్దాడు. ఈ ఫొటోను ఇలియానా షేర్ చేస్తూ... నేను ఈ జంప్ సూట్ ని బాగా ఇష్టపడుతున్నాను. షార్ట్ హెయిర్ మాట అంటారా..ఐ డోంట్ కేర్... ఈ లుక్ ని లవ్ చేస్తున్నా అంటూ శెలవిచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'బర్ఫీ'తో హిందీలో తొలి అడుగు వేసింది ఇలియానా. మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకొందీ భామ. షాహిద్‌ కపూర్‌తో కలిసి తాజాగా ఓ చిత్రంలో నటిస్తోంది. ఇక ముంబైలోనే స్థిర నివాసం ఏర్పరచుకొనేందుకు ఇలియానా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆ నగరంలో సెటిలైంది. '' ముంబైలో ఉంటేనే నాకు సౌకర్యంగా ఉంటుంది. అటు దక్షిణాది, ఇటు హిందీ చిత్రాలు చేయాలంటే గోవాలో ఉంటే వీలుపడదు. తెలుగు సినిమా ద్వారానే నేను నటనలో పాఠాలు నేర్చుకొన్నాను. బర్ఫీలో శ్రుతి పాత్రలో పరిపక్వత కనిపించిందనే ప్రశంసలు లభించడం సంతోషాన్నిచ్చింది'' అని చెప్పింది ఇలియానా.

 Ileana turns Style Diva!!

ఇక నిజం చెప్పాలంటే ఇలియానాకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఆమెపై అనఫీషియల్ గా బ్యాన్ రన్ అవుతున్న వాతావరణం కనిపిస్తోంది. అప్పట్లో అంటే రెండు సంవత్సరాల క్రితం వరసగా ఆమె చేసిన చిత్రాలు స్నేహితుడా, జులాయి,దేముడు చేసిన మనుష్యులు విడుదల అయ్యాయి. అయితే జులాయి తప్ప మిగతా రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. జులాయి సైతం ఇలియానాకు ప్రత్యేకమైన ఆఫర్స్ తెచ్చిపెట్టలేకపోయింది. దానికి తోడు ఈ చిత్రం ప్రమోషన్ లో ఇలియానా పాల్గొనకపోవటం బాగా హైలెట్ అయ్యింది. దాంతో ఇండస్ట్రీలో ఆమె అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్లింది. ఆమె సినిమాకు ప్లస్ కావచ్చు కానీ,సినిమాకు ప్లస్ అయ్యే ప్రమేషన్ ని పట్టించుకోకపోతే కష్టం అని నిర్మాతలు అంటున్నారు.

మరో ప్రక్క తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఇలియానా పేరు చెపితే మండిపడుతోంది. దానికి కారణం ఆమె జులాయి ప్రమోషన్ కి రాకుండా భాధ్యతారాహిత్యంగా ప్రవర్తించటమే అంటున్నారు. జులాయి ఆడియోకి సైతం డుమ్మా కొట్టిన ఈ ముద్దుగుమ్మ దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉండటంతో తెలుగుపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అంటున్నారు. దాసరి నారాయణ రావు సైతం ఆమె పై అప్పుడు మండిపడ్డారు. అలాగే అల్లు అర్జున్ సైతం ఇక తాను ఇలియానాతో చేయనని నిర్ణయించుకున్నారు.

జులాయి ఓకే అనిపించుకున్నా ఆమెకు త్రివిక్రమ్ కరువు కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్ చేసి మరీ అలాగే చూపెట్టాడు. దాంతో ఆమెకు తెలుగులో ఊహించిన క్రేజ్ రాలేదు. దాంతో ఇలియానా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సాధారణంగా మంచి సక్సెస్‌ ఉంటేనే ఇక్కడ ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. అలాంటిది వరసగా ఫెయిల్యూర్ లో ఉన్న ఆమె సన్నబడి మరీ అందం కూడా లేకుండా పోవటం ఆమెకు మైనస్ గా మారింది. అయితే ఆమె హిందీలో సినిమాలు చేస్తూండటంతో ధైర్యంగా ఉంది.

ఇలియానా మాత్రం ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటోంది. ఆమె మాట్లాడుతూ...''బర్ఫీ తర్వాత వచ్చిన చిత్రాల విజయం సంతోషాన్నిచ్చింది. నాకు అన్ని భాషలూ ఒక్కటే. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిపెడుతున్నా'' అంది. ప్రస్తుతం ఈ గోవా భామ తమిళ,హిందీ భాషల్లోనూ ఆమె బిజిగా ఉంది. సిని జీవితం గురించి ఇలియానా మాట్లాడుతూ ''కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే. విజయంవచ్చిందంటే... వెన్నంటే ఓటమి ఉంటుంది. కెరీర్‌ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేశా. మధ్యలో ఆ వేగం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ మునుపటి జోరు వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం కూడా ఆనందంగా ఉంది''అని చెప్పింది.

English summary
Sharing the lovely pictures, Ileana wrote, "Loved this sleek jumpsuit. Short hair? Don't care! Love this look on".
Please Wait while comments are loading...