»   » దర్శక, నిర్మాతలు నాకు అవకాశం ఇవ్వడం లేదు: ఇలియానా బాధ

దర్శక, నిర్మాతలు నాకు అవకాశం ఇవ్వడం లేదు: ఇలియానా బాధ

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శక నిర్మాతలు ఆ అవకాశం ఇస్తే కదా..నేను ఏదైనా చేసేది. సినిమా పూర్తయ్యాక నిర్మాణానంతర కార్యక్రమాలు హడావిడిగా జరిగిపోవడంతో నాకు అవకాశం రావడం లేదు అంటూ వాపోతోంది ఇలియానా. ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హిరోయిన్ గా ఎదిగిన ఆమెను మీరే మీ చిత్రాలకు డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా అంటే ఇలా స్పందించింది. అలాగే..నాకు తెలుగు అర్థమవుతుంది. బాగా నేర్చేసుకుని నా సంభాషణలు నేనే చెప్పుకోవాలని ఎంతో ఆశగా ఉంది. త్వరలోనే ఆ ఆశ తీరుతుందని కోరుకుంటున్నాను అంది.ప్రస్తుతం ఇలియానా..రానాతో నేనూ నా రాక్షసి, పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా, మహేష్‌ బాబుతో మరో సినిమా, ప్రభాస్‌ తో ఓ సినిమా చేస్తోంది. రెమ్యునేషన్ కూడా పెంచిన ఈ భామ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్వరలో బాలీవుడ్ లో కూడా ప్రవేశించి హిట్స్ కొడతానని నమ్మకంగా చెప్తోంది.

English summary
Ileana has said that she is still learning Telugu. The actress concludes that her dream is to dub her voice for a Telugu movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu