twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బండ్ల గణేశ్‌: రెండో రోజూ ఐటీ సోదాలు, అనుమానాలు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఆయన నివాసానికి వచ్చిన అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని గణేశ్‌ కార్యాలయంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

    బండ్ల గణేశ్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం. 41లోని ప్లాట్ నం.761లోని గణేశ్ కార్యాలయంలో సోమవారం ఏడుగురు అధికారులతో కూడిన బృందం సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. కొన్ని ఖాతాలపై అనుమానం రావడంతో గణేశ్‌ను పలుమార్లు ప్రశ్నించారు.

    బండ్ల గణేశ్‌ కార్యాలయంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు బృందాలుగా జూబ్లీహిల్స్‌లోని కార్యాలయానికి వచ్చిన ఐటీ అధికారులు ముందుగా గణేశ్‌ ఉన్నారా? లేరా? అన్న సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. తర్వాత సోదాల సమాచారాన్ని వివరించారు.గతేడాది ఆయన నిర్మించిన గబ్బర్‌ సింగ్‌ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే వారు సోదాలు చేశారని తెలిసింది. కొన్ని నెలల కిందట గణేశ్‌ కార్యాలయంలో ఐటీ అధికారులు సర్వే నిర్వహించారు.

    మొన్నటికి మొన్న దిల్ రాజు, దానయ్య నివాసాల్లో తనిఖీలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు... సోమవారం నిర్మాత బండ్ల గణేశ్ నివాసంపై దాడి చేశారు. బండ్ల గణేశ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'బాద్‌షా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సుమారు రూ.45 కోట్లతో నిర్మిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

    మరోవైపు... బండ్ల గణేశ్ కొన్నాళ్ల క్రితం ఓ దర్శకుడికి రూ.45 లక్షల విలువైన యాష్‌ట్రేను కూడా బహూకరించారు. ఈ నేపథ్యంలోనే గణేశ్‌పై ఐటీ అధికారులు దృష్టి సారించడం గమనార్హం. సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పలు రికార్డులను పరిశీలించిన అధికారులు వాటిలో కొన్నింటిని తీసుకెళ్లినట్లు సమాచారం.

    English summary
    Income Tax sleuths conducted Second Day raids at noted producer Bandla Ganesh's house and offices today also. Sources say, Raids would continue till late in the evening and the officials have already seized few documents.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X