»   »  కేన్స్‌లో అద్బుతం: మన సినిమాకు స్టాండింగ్‌ ఒవేషన్‌(వీడియో)

కేన్స్‌లో అద్బుతం: మన సినిమాకు స్టాండింగ్‌ ఒవేషన్‌(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కేన్స్‌ 68వ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన బాలీవుడ్‌ సినిమా 'మసాన్‌'కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. ప్రదర్శనకు హాజరైన సినీ ప్రముఖులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. దాదాపు అయిదు నిమిషాల పాటు నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారు. నీరజ్‌ ఘైవాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిచా ఛాదా ప్రధాన పాత్రలో నటించారు. మీరు ఆ అధ్బుత క్షణాలను ఈ క్రింద వీడియోలో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రేక్షకుల స్పందనతో కళ్లు చెమర్చాయని నటి రిచా ట్వీట్‌ చేశారు. నీరజ్‌కు, ప్రేక్షకులందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. మసాన్‌కు వచ్చిన అద్భుత స్పందన కంట తడిపెట్టించిందని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్వీట్‌ చేశారు.

అలాగే మసాన్‌ చిత్రంలో నటించిన నటులు చిత్ర ప్రదర్శనపై వచ్చిన స్పందనకు పట్టరాని ఆనందంతో ఉన్నారు. నీరజ్‌ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. చిన్న పట్టణంలో నలుగురు వేర్వేరు వ్యక్తుల వైవిధ్యమైన కథలతో ఈ చిత్రం రూపొందించారు.

మరో ప్రక్క వివాదం...క్షమాపణ

కేన్స్‌లో హై హీల్స్‌ వివాదంపై కేన్స్‌ చిత్రోత్సవ కార్యక్రమం డైరెక్టర్‌ క్షమాపణలు కోరారు. కార్ల్‌టన్‌ హోటల్‌ నిర్వహించిన ఓ విందులో డైరెక్టర్‌ థైరీ ఫ్రీమౌక్స్‌ ఈ వివాదంపై క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. హై హీల్స్‌ వేసుకోవాలని నిబంధనేమీ లేదని వెల్లడించారు.

ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగుతున్న 68వ కేన్స్‌ చిత్రోత్సవంలో హై హీల్స్‌ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. చిత్రోత్సవానికి హాజరైన కొందరు మహిళా ప్రముఖులు హైహీల్స్‌ వేసుకోలేదని రెడ్‌ కార్పెట్‌పైకి భద్రత సిబ్బంది అనుమతించకపోవడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం వివాదాస్పదమైంది. దీంతో ఈ అంశంపై వార్తల్లో, సోషల్‌ మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో కేన్స్‌ నిర్వహకులు వివాదాన్ని సద్దుమణిగించే పనిలో పడ్డారు.

Indian Film receives Standing Ovation at Cannes!

ఇదిలా ఉంటే...

కేన్స్‌ చలన చిత్రోత్సవ వేడుకల్లో బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ధరించిన దుస్తులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 29 ఏళ్ల సోనమ్‌ ఈసారి ఎలీ సాబ్‌ డిజైన్‌ చేసిన గౌను ధరించింది. సాధారణంగానే సోనమ్‌ మిగతావారితో పోలిస్తే కొంచెం 'బోల్డ్‌'గా ఉండే దుస్తులే ధరిస్తూ వచ్చిందిప్పటివరకూ.

ఈసారి మాత్రం సోనమ్‌ ధరించిన డ్రస్‌ అభిమానులను నిరాశపరిచింది. అది డ్రెస్సా... కార్న్‌ ఫ్లేక్సా... గడ్డి దుబ్బులా ఉంది, పేర్చిన బ్రెడ్‌ ముక్కల్లా ఉంది, బొచ్చు కుక్కపిల్లలా ఉందని.... అభిమానులు ట్విట్టర్‌ వేదికగా రకరకాల వ్యాఖ్యలు చేశారు.

English summary
Indian Film 'Masaan' received a standing ovation at Cannes Film Festival 2015. After the premiere held on May 19th ended, Viewers got up from their seats appreciating the efforts of the whole team and claps followed for a very long time.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu