»   » షాకింగ్ మరణాలు: ఆ లిస్టులో ఆర్తి అగర్వాల్ కూడా!

షాకింగ్ మరణాలు: ఆ లిస్టులో ఆర్తి అగర్వాల్ కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సినీ పరిశ్రమ ఎంతో మంది యువ కెరాటాలను రా..రమ్మని తన వైపు ఆకర్షించుకుంటూ ఉంటుంది. ఈ రంగుల గ్లామర్ ప్రపంచానికి ఎప్పటి కప్పుడు యవ్వన రక్తం ఎక్కితేనే కలర్ ఫుల్‌గా కళకళలాడుతూ ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సింది కూడా అదే. అయితే కొన్ని సందర్భాల్లో యువతారలు జీవితంలో అనుకోని సంఘటనల కారణంగా అనంత లోకాలకు వెలుతూ సినీ ప్రేమికులను షాక్‌కు గురి చేస్తున్నారు.

గడిచిన రెండేళ్లలో తెలుగు నటుడు ఉదయ్ కిరణ్, బాలీవుడ్ నటి జియా ఖాన్ లాంటి వారితో పాటు నటుడు శ్రీహరి కూడా హఠాన్మరణం పొందారు. తాజాగా తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆర్తి అగర్వాల్ కన్నుమూసారు. గతంలో చాలా మంది తారలు బలవన్మరణానికి పాల్పడగా, మరికొందరు విధిరాసిన రాతలో ప్రమాదాలకు గురై అసువులు బాసారు.

ఏది ఏమైనా తమను ఆట పాటలతో, గ్లామర్ సొగబులతో అలరించిన వారు హఠాన్మరణం పొందడం అభిమానులను బాధించే అంశమే. నేటితర నటి ఆర్తి అగర్వాల్ తో పాటు పాత తరం నటి ఫర్వీన్ బాబి, నిన్నటి తరం నటి దివ్య భారతి, స్మితా పాటిల్, గురు దత్, సంజీవ్ కుమార్, పాతతరం నటి మధుబాల ఇలా ఎందరో అర్దాంతరంగా తనువు చాలించిన వారే.

ఆర్తి అగ్వాల్

ఆర్తి అగ్వాల్

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆర్తి అగర్వాల్ బరువును తగ్గించుకోవడానికి లైపో సక్షన్ చేయించుకోగా అనారోగ్యం పాలయ్యారు. శ్వాసకోశ సంబంధ వ్యాధి కూడా తోడవటంతో చికిత్స పొందుతూ మరణించారు.

ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్

తెలుగు నటుడు ఉదయ్ కిరణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణం వెనక అనేక కారణాలు ప్రచారంలోకి వచ్చాయి.

శ్రీహరి

శ్రీహరి

ప్రముఖ తెలుగు నటుడు శ్రీహరి అనారోగ్యం కారణంగా మరణించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యమే అతని మరణానికి కారణమే వాదన కూడా ఉంది.

జియా ఖాన్

జియా ఖాన్

నటి జియా ఖాన్ గతేడాది జూన్ 3న తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమెది ఆత్మహత్య కాదు హత్యే అనే ఆధారాలు లభించాయని ఆమె తల్లి వాదిస్తోంది. సూరజ్ పంచోలితో ప్రేమ వ్యవహారమే ఆమె మరణానికి కారణమని తెలుస్తోంది. జియా కాన్ కేసు విచారణలో ఉంది.

దివ్య భారతి

దివ్య భారతి

తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యభారతి....పిన్న వయసులోనే మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే.

ఫర్వీన్ బాబి

ఫర్వీన్ బాబి

1970, 80ల్లో బాలీవుడ్‌ను తన గ్లామర్‌తో ఓ ఊపు ఊపిన ఫర్వీన్ బాబి జుహు‌లోని తన నివాసంలో మరణించారు. ఆమె మరణానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు.

మధుబాల

మధుబాల

బాలీవుడ్ చరిత్రలోని గొప్ప నటీమణుల్లో మధుబాల ఒకరు. గుండె సంబంధ సమస్యలతో ఆమె యంగ్ ఏజ్‌లోనే మరణించారు.

గురుదత్

గురుదత్

బాలీవుడ్ బహుముఖ ప్రజ్ఞాశాలి, నటుడు గురుదత్ 1964 అక్టోబర్ 10న మరణించారు. ముంబైలోని పెద్దార్ రోడ్ లోని తన రెంటెడ్ హౌస్ లో ఆయన మరణించిన కనిపించారు. స్లీపింగ్ పిల్స్, మధ్య కారణంగా ఆయన మరణించారు. ఆయన మరణం సూసైడ్ అని కొందరు. అనుకోకుండా ఓవర్ డోస్ అయిన మరణించారని కొందరి వాదన.

ప్రియా రజ్వాన్

ప్రియా రజ్వాన్

నటి ప్రియా రజ్వాన్స్-చేతన ఆనంద్ మధ్య పర్సనల్ రిలేషన్ షిప్ ఉండేది. వీరు కలిసి జీవించే వారు. మార్చి 27, 2000న ముంబై జుహులోని చేతన్ ఆనంద్ బంగ్లాలో ఆమె హత్య జరిగింది. పోలీసులు చేతన్ ఆనంద్ కుమారులపై కేసు నమోదు చేసారు.

నిర్మల్ పాండే

నిర్మల్ పాండే

బాలీవుడ్ నటుడు నిర్మల్ పాండే 48 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్‌తో మరణించారు.

మీనా కుమారి

మీనా కుమారి

పాత తరం నటి మీనా కుమారి మార్చి 31, 1972లో అనారోగ్యంతో మరణించారు. ఆమె నటించిన పాకీజా చిత్రం విడుదలైన మూడు వారాలకు ఆమె కన్ను మూసింది.

గీతా బాలి

గీతా బాలి

గీతా బాలి 1965 జనవరి 21న మరణించింది. పంజాబీ మూవీ ‘రానో' చిత్రం షూటింగ్ లో పాల్గొన్న ఆమెకు మశూచి వ్యాది సోకి మరణించింది.

తరుణి సచ్క దేవ్

తరుణి సచ్క దేవ్

బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణి సచ్ దేవ్ రస్నా యాడ్‌తో బాగా పాపులర్ అయింది. అతి చిన్న వయసులోనే విమాన ప్రమాదంలో మరణించింది.

స్మితా పాటిల్

స్మితా పాటిల్

బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి స్మితా పాటిల్....ప్రసవ సమయంలో వచ్చిన సమస్యలతో మరణించారు.

English summary
Tollywood and Bollywood industry has time and again welcomed and cherished several young talents who have reigned the tinselville and earned immense fame. But, the industry has also witnessed those sad days, when a few of the industry's most promising faces met the inevitable reality of life which is the death.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu