twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనవాళ్లకు సంగీత పరిజ్ఞానం లేదు.. తమన్ కాపీ ఆరోపణలపై ఇంద్రగంటి వివరణ వైరల్

    |

    ఈ మధ్య కాలంలో తమన్‌పై ప్రశంసలే తప్ప ట్రోల్స్, మీమ్స్, నెగెటివ్ కామెంట్స్ అన్నవే రాలేదు. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడం, కేవలం టాలీవుడ్ మాత్రమే తన మ్యూజిక్‌ను ఖండాంతరాలకు చేరవేశాడు. అలాంటి తమన్‌పై రీసెంట్‌గా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. V చిత్రానికి తమన్ అందించిన నేపథ్య సంగీతం బెడిసికొట్టింది. దీంతో సినిమా కథ, కథనం, డైరెక్టర్, హీరోల కంటే ఎక్కువగా తమన్ మీదే పడ్డారు.

    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్..

    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్..


    V చిత్రానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్‌గా మారింది. అది కూడా వేరే చిత్రాల నుంచి కాపీ కొట్టినట్టుగా ఉండటంతో అందరూ పెదవి విరిచారు. ఇన్నాళ్లు తెచ్చుకున్న పేరు Vతో పోయింది. అయితే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యం? ఎంత భిన్నంగా ఉండాలో అందరికీ తెలిసిందే.

    రాక్షసన్ మ్యూజిక్‌లా..

    రాక్షసన్ మ్యూజిక్‌లా..

    తమిళంలో రాక్షసన్ (తెలుగులో రాక్షసుడుగా రీమేక్) చిత్రం ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అందులో విలన్ సైకో కిల్లర్‌ ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా కీ బోర్డ్ ద్వారా ప్లే చేసినటువంటి ఓ రకమైన నేపథ్య సంగీతం వినిపిస్తుంది. అదే ఉన్నది ఉన్నట్టుగా Vచిత్రంలో వాడేశారని తమన్‌ను ఆడుకున్నారు. నాని ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఆ మ్యూజిక్ వాడారని కంప్లైంట్స్ వస్తున్నాయి.

    ఇంద్రగంటి వివరణ..

    ఇంద్రగంటి వివరణ..

    తమన్ కాపీ కొట్టలేదు. ఆయన స్టైల్ వేరు.. రాక్షసన్‌లో వినిపించింది.. Vలో ఉంది ఒకేలా అనిపించవచ్చు గానీ.. సౌండ్ ఇంజనీర్స్ కూడా అన్నారు కానీ అది కాపీ కాదు. ఒక్కో వాయిద్య పరికాల్లో ఒక్కోలా వస్తుంది. వాళ్లు అప్రోచ్ అయిన విధానం సేమ్ కానీ అది కాపీ కాదు. మన సమాజంలో అంతగా సంగీత పరిజ్ఞానం లేదు.. సంగీతం నేర్చుకున్న ప్రజలు లేరు..అర్థం చేసుకునే ప్రజలు లేరు..సంగీతాన్ని ఎప్పుడో అందరం కలిసి చంపేశాం.

    అపరిమితమైన సంగీత జ్ఞానం

    అపరిమితమైన సంగీత జ్ఞానం

    అందుకే వారంతా అది కాపీ అంటారు. సేమ్ అనిపిస్తే చాలు కాపీ అనేస్తారు. ఇలాంటివి కేవలం ఈ సినిమాకే కాదు అందరికీ జరిగాయి. వాళ్లు కాపీ కొట్టకపోయినా సరే అదే ముద్ర వేసేస్తారు. అతను సితార్ ఇతను సితార్.. అతను వయోలిన్.. ఇతను వయోలిన్ సౌండ్ సిమిలర్ కాపీ అనేస్తారు.. తమన్‌కు అసలు కాపీ కొట్టాల్సిన అవసరమే లేదు. అతనికి అపరిమితమైన సంగీత జ్ఞానం ఉంది అంటూ ఇంద్రగంటి ప్రశంసలు కురిపించాడు.

    తమన్ ఎమోషనల్

    తమన్ ఎమోషనల్

    తనపై వచ్చిన ట్రోలింగ్స్, నెగెటివ్ కామెంట్స్‌పై ఇంద్రగంటి అంత చక్కగా వివరణ ఇచ్చినందుకు తమన్ ఎమోషనల్ అయ్యాడు. సార్ మేము కంపోజర్స్ అయినా కూడా ఇంత చక్కగా వివరించలేము.. ఇలా చేసినందుకు లవ్యూ సర్ అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి V మాత్రం తమన్‌ను బద్నాం చేసేసింది.

    English summary
    Indraganti Mohana Krishna Explains Allegations About Thaman Copycat, The director explained that the style might look similar but not the tunes. According to him, the BGM of ‘V’ isn’t a copy and he justifies saying that he knows music and was trained in that. Audiences may not be trained in music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X