»   » అవసరాలతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ 'అమీ తుమీ' తేల్చుకోవటానికే...

అవసరాలతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ 'అమీ తుమీ' తేల్చుకోవటానికే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అష్టా చెమ్మా, జెంటిల్ మెన్ చిత్రాలతో హిట్స్ కొట్టిన డైరక్టర్ ...మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఖరారైంది. ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీకి 'అమీ తుమీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఆదివారం సాయంత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన వేడుకలో చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేసారు.

Indraganti Mohanakrishna's film titled 'Ami Tumi'

చిత్ర నిర్మాత నరసింహారావు మాట్లాడుతూ.. 'ఈనెల 23వ తేదీతో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న 'అమీ తుమీ' తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుంది.

ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేసి ఆడియోతో పాటు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు.

ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి ఇంద్రగంటి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి 'అమీ తుమీ' అనే వెరైటీ టైటిల్ పెట్టడంతోటే అందరి దృష్టినీ ఆకర్షించారు. తాను డైరెక్ట్ చేసిన 'అంతకుముందు - ఆతర్వాత' సినిమాతో ఈష అనే తెలుగమ్మాయిని పరిచయం చేసారు. ఆ సినిమా సక్సెస్ అయినా కూడా ఆమెకు బ్రేక్ రాలేదు. 'అమీ తుమీ' లో ఆమెకు ఓ ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నారు ఇంద్రగంటి.

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!

English summary
Director Indranganti Mohanakrishna now directing a comedy movie starring Avasarala Srinivas and Adivi Sesh in main roles. And the movie is titled 'Ami Tumi'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu