»   » ‘ఇంద్రసేన’ ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

‘ఇంద్రసేన’ ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Indrasena" Movie First Look Unveiled By Mega Star

'బిచ్చగాడు' స్టార్ విజయ్ ఆంటోని నటించిన తమిళ చిత్రం తెలుగులో 'ఇంద్రసేన'గా రాబోతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... తనకు ఎంతో ఆప్తురాలైన రాధిక నిర్మిస్తున్న సినిమా అని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోని నటుడిగా ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్నాడు, ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ తాను మల్టీ టాలెంట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి ప్రయత్నం సక్సెస్ కావాలన్నారు.

ఇంద్ర సేన

ఇంద్ర సేన

తమిళంలో 'అన్నాదురై' పేరుతో తెరకెక్కుతున్న చిత్రాన్ని తెలుగులో 'ఇంద్రసేన'గా రిలీజ్ చేయనున్నారు. ఈచిత్రాన్ని రాధిక శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

చిరు-రాధిక

చిరు-రాధిక

చిరంజీవి, రాధిక కలిసి గతంలో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహం ఉంది. చిరంజీవి కుటుంబంతో రాధికకు విడదీయరాని అనుబంధం ఉంది.

తాగుబోతు, టీచర్ పాత్రల్లో

తాగుబోతు, టీచర్ పాత్రల్లో

ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రలో తాగుబోతుగా, మరో పాత్రలో టీచర్ గా విజయ్ ఆంటోనీ కనిపించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

విజయ్ ఆంటోనీ మల్టీ టాలెంట్

విజయ్ ఆంటోనీ మల్టీ టాలెంట్

ఈ సినిమాకు ఎడిటింగ్ కూడా విజయ్ ఆంటోనీ చేస్తుండటం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ గా కోరీర్ మొదలు పెట్టి, తర్వాత హీరో, నిర్మాతగా తన సత్తా నిరూపించుకున్న విజయ్ ఆంటోనీ, ఇపుడు ఎడిటింగ్ లాంటివి చేస్తూ తాను మల్టీ టాలెంట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

English summary
Chiranjeevi launches Vijay Antony's upcoming telugu film 'Indrasena' first look today. Newcomer Srinivasan is directing the film in which Vijay Antony is playing a dual role. Jointly produced Vijay Antony Film Corporation and Radhika Sarathkumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu