»   » ‘ఇంద్రసేన’ ట్రైలర్: బిచ్చగాడు సినిమాను మించిపోయేలా ఉందే...

‘ఇంద్రసేన’ ట్రైలర్: బిచ్చగాడు సినిమాను మించిపోయేలా ఉందే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బిచ్చగాడు' సినిమాతో తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా ఎఫెక్టుతో.... విజయ్ ఆంటోనీ సినిమా వస్తుందంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది.

బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన 'సైతాన్' తెలుగులో విడుదలకు సిద్ధమైనపుడు భారీ హైప్ వచ్చింది. అయితే ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు కెనెక్ట్ కావడంలో విఫలం కావడంతో ప్లాప్ లిస్టులో చేరింది. త్వరలో విజయ్ ఆంటోనీ 'ఇంద్ర సేన' సినిమా ద్వారా రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ బుధవారం విడుదలైంది.

ట్రైలర్ అదిరిపోయింది

ట్రైలర్ అదిరిపోయింది

తాజాగా విడుదలైన ‘ఇంద్రసేన' ట్రైలర్ అదిరిపోయింది. ఆర్ స్టూడియోస్ బేనర్లో ఈ చిత్రాన్ని రాధిక శరత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో విజయ్ ఆంటోనీ కూడా భాగస్వామిగా ఉండటం విశేషం.

డైలాగ్స్ అదుర్స్

డైలాగ్స్ అదుర్స్

స్టైట్ గా వెళ్లి రైట్ తీసుకుంటే ఒక ఓటమి ఎదురవుతుంది..., దాన్నుండి లెఫ్ట్ కి వెళితే పెద్ద నమ్మక ద్రోహం కనిపిస్తుంది...., ఇంకొంచెం ముందుకెళ్లి యూ టర్న్ తీసుకుంటే నువ్వు తీసుకున్న అబ్బని ఒక లోయ కనిపిస్తుంది..., ఆ లోయలో పడి ముక్కు మొహం పగలగొట్టుకుని ముందుకెళితే మనం మోస పోయామనే ఒక సిగ్నల్ పడుతుంది..., ఆ సిగ్నల్ ని కూడా దాటుకుని టాప్ గేర్ వేసి ముందుకెళితే ఆ తర్వాత వచ్చే ఇల్లే నువ్వు కోరుకున్న విజయం... ఆ విజయాన్ని అందుకుని వెనక్కి తిరిగి చూస్తే యముడు మనకన్నా ముందు వచ్చి మన కోసం వేచి ఉంటాడు..... అంటూ ట్రైలర్లో వినిపించిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

డిఫరెంటుగా ఇంద్రసేన

డిఫరెంటుగా ఇంద్రసేన

ట్రైలర్ చైస్తుంటే ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నింటికంటే డిపరెంటుగా ఈ సినిమా ఉండబోతోందని, ప్రతి మనిషి జీవితానికి దగ్గరా ఉండే రియలిస్టిక్ డ్రామాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

తమిళంలో అన్నాదురై

తమిళంలో అన్నాదురై

తమిళంలో 'అన్నాదురై' పేరుతో తెరకెక్కుతున్న చిత్రాన్ని తెలుగులో 'ఇంద్రసేన'గా రిలీజ్ చేయనున్నారు. ఈచిత్రాన్ని రాధిక శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

చిరంజీవి ద్వారా ప్రమోషన్స్

చిరంజీవి ద్వారా ప్రమోషన్స్

ఇంద్రసేన' ఫస్ట్ లుక్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. చిరంజీవి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది. మంచి పబ్లిసిటీ జరిగింది.

ప్రశంసించిన చిరంజీవి

ప్రశంసించిన చిరంజీవి

సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోని నటుడిగా ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్నాడని, ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ తాను మల్టీ టాలెంట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.

ద్విపాత్రాభినయం

ద్విపాత్రాభినయం

ఈ చిత్రంలో విజయ్ ఆంటెనీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తాగుబోతు, టీచర్ పాత్రల్లో ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రలో తాగుబోతుగా, మరో పాత్రలో టీచర్ గా విజయ్ ఆంటోనీ కనిపించబోతున్నారు.

English summary
Official Trailer of "Indrasena" released. "Indrasena" written & directed by G.Srinivasan; starring Vijay Antony. Starring Vijay Antony, Diana Champika, Mahima, Jwell Mary, Radha Ravi, Kaali Venkat, Nalinikanth & Rindhu Ravi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu