»   » నెం.1 అంటూ నిర్మాత చెప్పేవి ఫేక్ కలెక్షన్లే?

నెం.1 అంటూ నిర్మాత చెప్పేవి ఫేక్ కలెక్షన్లే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాను రాను స్టార్ హీరోల మధ్య పోటీ వాతావరణం తీవ్రంగా పెరిగి పోతోంది. పైకి నవ్వుతూ కలివిడిగా కనిపించినా....వారి మధ్య అంతర్గతంగా ఆధిపత్యం సాధించాలనే కోల్డ్ వార్ సాగుతుంని స్పష్టం అవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ సినిమా పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదని తాజాగా బాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

ప్రస్తుతం బాలీవుడ్లో హృతిక్ రోషన్ సూపర్ హీరో పాత్రలో నటించిన చిత్రం 'క్రిష్-3'. ఈ చిత్రానికి ఆయన తండ్రి రాకేష్ రోషన్ స్వీయ నిర్మాణ దర్శకత్వం వహించారు. క్రిష్-3 చిత్రం అన్ని బాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టిందని, తమ చిత్రమే వసూళ్ల పరంగా ప్రస్తుతం నెం.1 స్థానంలో నిలిచిందని కొన్ని రోజులుగా ఆయన ప్రచారం చేస్తున్నారు.

అయితే నిర్మాత రాకేష్ రోషన్ చెబుతున్నవి అన్నీ తప్పుడు లెక్కలే అని బాలవుడ్ ట్రేడ్ విశ్లేషకుల్లోని ఓ వర్గం వాదన. ఇప్పటి వరకు షారుక్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రమే కలెక్షన్ల పరంగా నెం.1 స్థానంలో ఉందని అంటున్నారు. అయితే మరో వర్గం మాత్రం క్రిష్-3 చిత్రమే నెం.1 అంటూ వాదిస్తున్నారు.

ఒక వర్గం ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్న లెక్కలు ప్రకారం క్రిష్-3 చిత్రం ఈప్పటి వరకు హిందీలో రూ. 183 కోట్లు మాత్రమే వసూలు చేసిందని, ఇతర బాషల్లో అనువాదాలు కలిపి రూ. 194 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. కానీ ఇతర సినిమాల లెక్కలు ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. 3 ఇడియట్స్ 202 కోట్లు, ఏక్ థా టైగర్ 197 కోట్లు, చెన్నై ఎక్స్ ప్రెస్ 227 కోట్లుగా ఉంది.

అయితే రాకేష్ రోషన్ చెబుతున్న లెక్కలు మరో ఉన్నాయి. తమ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో 237 కోట్లు వసూలు చేసిందని, ఇంటర్నేషనల్ మార్కెట్లో 54 కోట్లు వసూలు చేసిందని అంటున్నారు. చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డు బద్దలైందో లేదో నాకు తెలియదు....నేను చెబుతున్నది క్రిస్-3 వసూళ్ల గురించి అంటున్నారు రాకేష్ రోషన్. అయితే ఇతరులు మాత్రం రాకేష్ రోషన్ చెబుతున్న లెక్కలు పబ్లిసిటీ స్టంటే అంటున్నారు.

English summary
Bollywood Industry insiders say collections figures of Krrish 3 are exaggerated. A leading financial paper reported: Krrish 3 is fastest film to enter Rs200-cr club with its box-office collections putting in shade Shah Rukh Khan’s Chennai Express.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu