»   » ఫాం హౌస్ లో పుట్టిన రోజు పార్టీ, హీరోయిన్స్ తో రచ్చ (ఫొటోలు)

ఫాం హౌస్ లో పుట్టిన రోజు పార్టీ, హీరోయిన్స్ తో రచ్చ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 50 ఏళ్ల వయసులోనూ పర్‌ఫెక్ట్‌ బాడీ బిల్డింగ్‌తో.. ఏడాదికో బ్లాక్‌బస్టర్‌ సినిమాతో కుర్రకారుని తన మాయలో పడేసిన సల్మాన్‌ మంగళవారం 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎప్పటిలాగే తన 51వ పుట్టినరోజు వేడుకనుసల్మాన్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆనందంగా జరుపుకున్నారు. పన్వేల్‌లోని సల్లూభాయ్‌ ఫాంహౌస్‌లో ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీకి తన స్నేహితులను కూడా ఆహ్వానించారు.

బాలీవుడ్‌ ప్రముఖులు ప్రీతీ జింటా, బిపాసాబసు, కబీర్‌ ఖాన్‌, రణ్‌దీప్‌ హుడా, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌, సూరజ్‌ పంచోలీ, సాజిద్‌ నదియాద్‌వాలా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

బర్త్‌డే పార్టీలో తాను కేక్‌ కట్‌ చేస్తున్నప్పుడు అల్లుడు అహిల్‌ దాన్ని చూస్తుండగా తీసిన ఒక ఫొటోను సల్మాన్‌ ఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

అదే మొదటి సినిమా

అదే మొదటి సినిమా

ప్రముఖ రచయిత సలీం ఖాన్‌ కుమారుడు సల్మాన్‌. ఇతనికి ఇద్దరు సోదరులు, ఓ సోదరి. అర్బాజ్‌ ఖాన్‌, సొహైల్‌ ఖాన్‌, అర్పితా ఖాన్‌. సల్మాన్‌ హీరోగా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన చిత్రం ‘బీవీ హోతో ఐసీ'. 1988లో వచ్చిన ఈ చిత్రంతో సల్మాన్‌కి హీరోగా మంచి పేరే వచ్చింది.

మైనే ప్యార్ కియా తర్వాత

మైనే ప్యార్ కియా తర్వాత

ఆ తర్వాత దర్శకుడు సూరజ్‌ భర్జాత్యా తెరకెక్కించిన ‘మైనే ప్యార్‌ కియా' సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఇందులో సల్మాన్‌ సరసన భాగ్యశ్రీ నటించారు. ముఖ్యంగా సినిమాలోని ‘మేరే రంగ్‌ మే..' అనే పాటకు ఇప్పటికీ క్రేజ్‌ తగ్గలేదు. మైనే ప్యార్‌ కియా సినిమా తెలుగులో ప్రేమపావురాలుగా వచ్చింది.

ఫోర్బ్స్ జాబితాలో

ఫోర్బ్స్ జాబితాలో

అక్కడి నుంచి సల్మాన్‌ కెరీర్‌గ్రాఫ్‌ మలుపు తిరిగింది. వరుసగా హమ్‌ ఆప్కేహై కౌన్‌, కరణ్‌ అర్జున్‌, బీవీ నెం.1, హమ్‌ సాథ్‌ సాథ్‌ హై, కుచ్‌ కుచ్‌ హోతా హై ఇలా వరుస హిట్లతో దూసుకుపోయారు. ఇక 2010 నుంచి దబాంగ్‌, బాడీగార్డ్‌, ఏక్‌ థా టైగర్‌, కిక్‌, బజరంగీ భాయ్‌జాన్‌, సుల్తాన్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. పేరు ప్రఖ్యాతల్లో, అత్యంత సంపన్న సెలబ్రిటీ జాబితాలో సల్మాన్‌ 2014లో ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో స్థానం సంపాదించారు.

ఓవర్ సీస్ లోనూ..

ఓవర్ సీస్ లోనూ..

ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క సొంతంగా ‘బీయింగ్‌ హ్యూమన్‌' పేరిట సంస్థ స్థాపించారు. బీయింగ్‌ హ్యూమన్‌ బ్రాండ్‌ దుస్తులకు ఓవర్‌సీస్‌లోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఈ ఫౌండేషన్‌ ద్వారావచ్చిన డబ్బులో కొంత అనాథ పిల్లల కోసం వెచ్చిస్తున్నారు.

మూడు జాతీయ అవార్డ్ లు

మూడు జాతీయ అవార్డ్ లు

ఇవే కాకుండా 2011లో సల్మాన్‌ ఖాన్‌ బీయింగ్‌ హ్యూమన్‌ ప్రొడక్షన్స్‌ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించిన నిర్మాతగానూ తానేంటో నిరూపించుకుంటున్నారు. సల్మాన్‌ నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘చిల్లర్‌ పార్టీ'. పిల్లల కోసం తీసిన ఈ చిత్రానికి గానూ మూడు జాతీయ అవార్డులు వచ్చాయి.

కెనిడియన్ చిత్రం

కెనిడియన్ చిత్రం

ఆ తర్వాత 2014లో సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌ పేరిట మరో నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌పై ‘డా.క్యాబీ' అనే కెనడియన్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత హీరో, బజరంగీ భాయ్‌జాన్‌ సినిమాలు ఈ బ్యానర్‌పై నిర్మించారు.

టీఆర్పీ రేటింగ్స్

టీఆర్పీ రేటింగ్స్

ఇక సల్మాన్‌ హోస్ట్‌ చేసే టీవీ కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 2008లో సల్మాన్‌ ‘10 కా దమ్‌' అనే రియాల్టీ షోను హోస్ట్‌ చేశారు. ఈ షో అప్పట్లో టీఆర్‌పీ రేటింగ్స్‌లో భారత్‌లోనే తొలి స్థానంలో నిలిచింది.

ఇప్పటికీ సల్మాన్

ఇప్పటికీ సల్మాన్

అంతేకాదు ఆయనకు బెస్ట్‌ యాంకర్‌గానూ అవార్డు తెచ్చిపెట్టింది. 2010 నుంచి దబాంగ్‌ ఖాన్‌ సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌'కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ నుంచి ఇప్పటివరకు వరుసగా సల్మానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

పాపులారిటీ..

పాపులారిటీ..

ఈ షోకి ఎంత పాపులారిటీ వచ్చిందంటే.. అప్పటి వరకు ట్రెండింగ్‌గా ఉన్న పలు సెలబ్రెటీ షోలను సైతం వెనక్కి నెట్టి బిగ్‌బాస్‌ టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఇప్పటికీ దూసుకెళుతోంది.సల్మాన్‌ ప్రస్తుతం కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ట్యూబ్‌లైట్‌' సినిమాలో నటిస్తున్నారు. 2017 రంజాన్‌కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

ట్యూబ్ లైట్

ట్యూబ్ లైట్

ఈ ఏడాది సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సల్మాన్‌ రెజ్లర్‌ పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్దమంచి వసూళ్లు రాబట్టింది. సల్మాన్‌ ప్రస్తుతం కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ట్యూబ్‌లైట్‌' చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన 2012లో విజయం సాధించిన ‘ఏక్‌థా టైగర్‌' సీక్వెల్‌లో నటించనున్నారు.

English summary
Salman Khan has turned 51. And his birthday celebrations all across the country have kick-started. Salman himself, along with his family and close friends, welcomed his birthday at his Panvel farmhouse last night. He even posted a picture of him cutting his birthday cake with nephew Ahil.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu