»   » చైతూ, సమంత మ్యారేజ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. పెళ్లి వేదిక ఎక్కడంటే..

చైతూ, సమంత మ్యారేజ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. పెళ్లి వేదిక ఎక్కడంటే..

Written By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నట వారసుడు నాగచైతన్య, అందాల తార సమంత పెళ్లి భజంత్రీలు త్వరలోనే మోగనున్నాయి. చైతూ, సమంతల పెళ్లి ఏర్పాట్లు అప్పడే వేగం అందుకొన్నాయి. ఇరు కుటుంబాలు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన కుమారుడి పెళ్లిని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లికి హాజరయ్యే గెస్టుల వివరాలు, పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్‌లో జరిగే ఈ సెన్సేషనల్ వెడ్డింగ్‌ గురించి తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు

మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు

సమంత, నాగచైతన్య వివాహం అక్టోబర్‌ 6న గోవాలో జరుగనున్నదనే తాజా సమాచారం. అక్టోబర్‌ 6 నుంచి 8 వరకు మూడురోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరుగుతాయనేది సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరి పెళ్లి హిందూ, క్రైస్తవ పెళ్లి సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసిందే. తొలుత గోవాలోని చర్చిలో క్రైస్తవ మతాచారం ప్రకారం, ఆ తర్వాత హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుందట. ఈ మేరకు అరెంజ్‌మెంట్లు జరుగుతున్నాయనేది లేటెస్ట్ న్యూస్.

40 రోజులపాటు హానీమూన్ టూర్

40 రోజులపాటు హానీమూన్ టూర్

పెళ్లి తర్వా చైతన్య, సమంత 40 రోజులపాటు హనీమూన్‌ కోసం న్యూయార్క్‌కు వెళ్లనున్నట్లు మీడియా వర్గాల సమాచారం. తమ పెళ్లికి పునాది పడిన ఏం మాయ చేసావే చిత్ర షూటింగ్ జరిగిన ప్రాంతాలను ఈ సందర్భంగా సందర్శిస్తారని మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఆ చిత్ర షూటింగ్‌లోనే వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిన సంగతి తెలిసిందే.

షూటింగ్‌లు పూర్తి చేసుకొనే పనిలో..

షూటింగ్‌లు పూర్తి చేసుకొనే పనిలో..

పెళ్లికి ముందే తాము నటిస్తున్న చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేసుకోనే పనిలో చైతన్య, సమంత ఉన్నారు. సమంత ప్రస్తుతం రాజుగారి గది2, రంగస్థలం చిత్రంలో నటిస్తున్నది. ఇవి కాకుండా తమిళంలో శివకార్తికేయన్‌తో జత కట్టడానికి అంగీకరించారు. శివకార్తికేయన్‌తో రొమాన్స్‌ చేయనున్న చిత్రం ఈ నెల 18వ తేదీన ప్రారంభమైంది.

నిర్మాతలకు చైతూ, సామ్ రిక్వెస్ట్

నిర్మాతలకు చైతూ, సామ్ రిక్వెస్ట్

ఈ చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లను పెళ్లికి ముందే పూర్తి చేయాలని నిర్మాతలను కోరినట్టు సమాచారం. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లిని ఎంజాయ్ చేయవచ్చనే ఆలోచనలో సమంత ఉంది. నాగచైతన్య కూడా అదే మాదిరిగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

రెండు నెలలు దూరంగా..

రెండు నెలలు దూరంగా..

పెళ్లి జరిగిన తర్వాత వివాహానంతరం రెండునెలలపాటు సినిమాలకు దూరంగా ఉండి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలని నాగచైతన్య, సమంత నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది. రెండు నెలలపాటు నిర్మాతలకు తమ వల్ల ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

English summary
Actress Samantha is getting ready to marriage with Nagachaitanya Akkineni. Their marriage is fixed on october 6 of this year. Marriage will be organised three days. Before her marriage Samantha wants finish her movie project and likely to away two months for cinema shootings.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu