సైందవ..వామ్మో ఇదేమి టైటిల్, నాగశౌర్య నెక్స్ట్ మూవీ!
నాగశౌర్య చలో చిత్ర విజయంతో మంచి జోష్ మీద ఉన్నాడు. ఛలో చిత్రం ప్లాపుల్లో ఉన్న నాగశౌర్య కు మంచి బ్రేక్ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం అలరించింది. కాగా నాగశౌర్య ప్రస్తుతం సినిమాల జోరు పెంచాడు. సాయిపల్లవి తో నటించిన కణం చిత్రం విడుదల కావలసి ఉంది. అమ్మమ్మ గారిల్లు చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ రెండు చిత్రాలు వేసవిలోనే విడుదల కానున్నాయి. తాజగా నాగశౌర్య మరో చిత్రాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
పైసా వసూల్ చిత్ర నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. డెబ్యూ డైరెక్టర్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి భిన్నమైన కథతో ఈ చిత్రం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి 'సైందవ' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సైందవుడు మహా భారతంలో ఓ పాత్ర అనే సంగతి తెలిసిందే. దీనితో నాగశౌర్య పాత్ర గురించి ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైనట్లు తెలుస్తోంది. పేరుగాంచిన హీరోయిన్ నే ఈ చిత్రం కొరకు ఎంపిక చేసుకోబోతున్నారు.


Click it and Unblock the Notifications











