Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
ఓ ఇంటిదైన బుల్లితెర యాంకర్.. కల నిజమైందంటూ పోస్ట్ చేయడంతో!
Recommended Video
ప్రతీ వ్యక్తి జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలను నెరవేర్చుకునేలా ఓ గమ్యాన్ని ఏర్పర్చుకొని, దాన్ని రీచ్ అయినపుడు ఆ సంతోషాన్ని వెలకట్టగలమా!. సరిగ్గా అలాంటి ఓ సందర్భం, సంతోషంలో మునిగి తేలుతోంది యాంకర్, నటి హరితేజ. ఇంతకీ అసలు సంగతేంటి? హరితేజ అవధుల్లేని ఆనందానికి కారణాలేంటి? వివరాల్లోకి పోతే..

బుల్లితెర, వెండితెరలపై హరితేజ సందడి
బుల్లితెర, వెండితెర ఆడియన్స్‌కి బాగా సుపరిచితం హరితేజ. యాంకర్ గా బుల్లితెరపై, ఆర్టిస్ట్ గా వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. సెటైరికల్ డైలాగులతో స్టేజ్ షోల్లో అదరగొట్టేయడం ఈమె లోని మరో ప్రత్యేకత. ఇక గత సీజన్ బిగ్‌బాస్ హౌస్‌లో కూడా హరితేజ చేసిన సందడి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈమె తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసింది.
|
ఒక్కో కలను నిజం చేసుకుంటూ
ఈ సంతోషానికి కారణం ఆమె ఓ సొంత ఇల్లు కొనుక్కోవడం. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న హరితేజ.. తన ఒక్కో కలను నిజం చేసుకుంటూ వస్తోంది. ఇటీవలే తనకు ఇష్టమైన కారు కొనుక్కొని ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఆమె.. తాజాగా ఇల్లు కూడా కొనుక్కొని మరో అడుగు ముందుకేసింది.
|
మురిసిపోయిన హరితేజ.. భర్తతో కలిసి
అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఓ ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంటిలోకి ప్రవేశం చేసింది హరితేజ. భర్తతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంత కాలానికి తాను కన్న కలని నిజం చేసుకున్నానని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. తన కొత్త ఇల్లు, ఇంట్లోకి ప్రవేశిస్తున్న కొన్ని పిక్స్ షేర్ చేస్తూ తెగ మురిసిపోయింది.

ఈ ఫొటోలు షేర్ చేయడానికి కారణం
తన కెరీర్‌లో సపోర్ట్ చేస్తూ, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వారితో తన ఆనందాన్ని పంచుకోవడానికే ఈ ఫొటోని షేర్ చేస్తున్నానని తెలిపింది హరితేజ. తన లైఫ్, తన ఎదుగుదలలో ఎంత మంది సపోర్ట్‌గా నిలిచారో.. ఎంత మంది తమ సహాయ సహకారాల్ని అందించారో అందరికీ కృతజ్ఞతలు తెలిపింది హరితేజ.