twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Baahubali అక్షరాల 150 కోట్లు బూడిదలో పోసినట్టే.. బాహుబలి ప్రాజెక్టుపై అలాంటి దెబ్బ!

    |

    ప్రపంచ సినిమా చరిత్రలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలికి ప్రత్యేకమైన గుర్తింపు స్థానం ఉంది. బాహుబలి చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. ఆ చిత్రం ప్రపంచ సినిమా ప్రముఖులను మరోసారి ఆలోచింపజేసేలా చేసింది. బాహుబలి చిత్రం అన్ని భారతీయ భాషల్లో నిర్మితమయ్యే సినిమాలకు ప్రేరణగా నిలిచింది. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత నెటిఫ్లిక్స్ ప్రయోగాత్మకంగా బాహుబలి ప్రీక్వెల్‌ను మొదలు పెట్టింది. అయితే ఈ సినిమాపై చేతులెత్తేయడానికి కారణాలు ఏమిటంటే?

    ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నెట్‌ఫ్లిక్స్

    ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నెట్‌ఫ్లిక్స్

    బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ తర్వాత ఆ రెండు చిత్రాలకు ప్రీక్వెల్‌గా బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టంది. ఎస్ఎస్ రాజమౌళి ఫిలింస్‌ బ్యానర్‌తో భాగస్వామ్యమై నిర్మాణాన్ని చేపట్టింది. ఈ సినిమాను దేవకట్టా, ప్రవీణ్ సత్తారుకి అప్పగించారు. రాజమౌళి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి.

    దేవకట్టా, మృణాల్ ఠాకూర్ అవుట్

    దేవకట్టా, మృణాల్ ఠాకూర్ అవుట్


    బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా హిందీ నటి మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు దేవ కట్టా చేతుల్లో పెట్టారు. అయితే ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. హీరోయిన్ మృణాల్ సేన్ అర్ధాంతరంగా తప్పుకొన్నారు. ఆ తర్వాత దర్శకుడు దేవకట్టా కూడా ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చారు. దాంతో బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ ప్రాజెక్ట్ ముందుకెళ్తుందా? అనే ప్రశ్నలు లేచాయి.

    150 కోట్లు ఖర్చు చేసిన తర్వాత

    150 కోట్లు ఖర్చు చేసిన తర్వాత

    అయితే జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బాహుబలి: బిఫోర్ బిగినింగ్ ప్రాజెక్ట్ కోసం నెట్‌ఫ్లిక్ ఏకంగా 150 కోట్లు ఖర్చు చేసింది. నెట్‌ఫ్లిక్స్ అంచనాలకు తగినట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేకపోవడంతో నిర్వాహకులు పెదవి విరిచారు. రకరకాల చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ సినిమాను ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించారు అని కథనంలో తెలిపారు.

    మరో 200 కోట్లు అవసరం కావడంతో

    మరో 200 కోట్లు అవసరం కావడంతో


    బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ సినిమా నిర్మాణంలో జరిగిన ఖర్చులు, చేసిన రుణాలను తీర్చడానికి మరికొంత బడ్జెట్‌ను వెచ్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లలేమని నిర్ణయం తీసుకొన్నారు. మరో 200 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టడం అనవసరం భావించారు. భవిష్యత్‌లో అవకాశం ఉంటే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్దామని అనుకొంటున్నారు అనే విషయాన్ని చిత్ర యూనిట్‌కు సంబంధించిన వారు వెల్లడించారు.

    బాహుబలిలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    బాహుబలిలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ సినిమా విషయానికి వస్తే.. ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత రాసిన ది రైస్ ఆఫ్ శివగామి చతురంగ, క్వీన్ ఆఫ్ మాహిష్మతి అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు రచయతలుగా దేవకట్టా, ఆనంద్ నీలకంఠన్ వ్యవహరించారు. దేవకట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వమికా గబ్బి, రాహుల్ బోస్, అతుల్ కులకర్ణి, నయనతార, మృణాల్ ఠాకూర్‌ తదితరులు నటించారు.

    English summary
    Baahubali: Before The Beginning was started after success of Baahubali: The Beginning and The Conclusion by Netflix. But Report suggested that, it stopped spending after 150 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X