»   » నంబర్ వన్ చిరునేనా.. 1 టూ 10 మెగాస్టారేనా.. పదేండ్ల తర్వాత కూడా పోటీ లేదా!

నంబర్ వన్ చిరునేనా.. 1 టూ 10 మెగాస్టారేనా.. పదేండ్ల తర్వాత కూడా పోటీ లేదా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ లాంటి నట దిగ్గజాల తర్వాత నంబర్‌వన్ స్థానాన్ని చేజిక్కించుకొన్నది మెగాస్టార్ చిరంజీవి. వరుస విజయాలు, రికార్డు కలెక్షన్లతోనే కాకుండా విశేష ప్రేక్షకాదరణ కూడగట్టుకొన్న చిరంజీవికి టాలీవుడ్‌లో ఎదురే లేకుండా పోయింది. 2007లో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు చాలా ఏండ్లు అగ్రస్థానంలో కొనసాగారు.

  అగ్రస్థానంపై చిరంజీవి ఇలా..

  అగ్రస్థానంపై చిరంజీవి ఇలా..

  చాలా ఏండ్ల క్రితమే ప్రవేశించిన ఖైదీ చిత్రంతోనే టాలీవుడ్‌లో చిరంజీవి శకం ప్రారంభమైంది. ఖైదీకి ముందు. ఆ తర్వాత అనుకుంటే.. ఆ చిత్రానికి ముందు మంచుపల్లకి, కోతలరాయుడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రాలు ఘన విజయం సాధించినా స్టార్ డమ్ దక్కలేదు. సంచలన చిత్రం ఖైదీతో పూర్తిస్థాయి స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత వెనుకకు తిరిగి చూడలేదు. వరుసగా గూండా, ఖైదీ నంబర్ 786, జగదేక వీరుడు అతిలోక సుందరి, స్టేట్ రౌడీ, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు చిత్రాలతో మెగాస్టార్‌గా మారాడు. ఆ తర్వాత ఇంద్ర, టాగోర్, స్టాలిన్ చిత్రాలు అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేశాయి.

  నంబర్ వన్ నుంచి నంబర్ 10 వరకు

  నంబర్ వన్ నుంచి నంబర్ 10 వరకు

  టాలీవుడ్‌లో చిరంజీవి జోరు కొనసాగుతున్న సాగుతున్న సమయంలో నంబర్ వన్ స్థానమే కాదు.. నంబర్ 10 స్థానం వరకు మెగాస్ఠార్ దేనని చెప్పుకొనేవారు. పలు సినీ వేదికలపై స్వయంగా అగ్రహీరోల నోటి నుంచే ఈ మాట వచ్చేది. కేవలం అగ్రస్థానమే కాకుండా ఎన్టీఆర్ తర్వాత అంతటి విశేష ప్రజాదరణ ఉన్న హీరోగా అంతటి ఘనతను సొంతం చేసుకొన్నాడు. భారీ సంఖ్యలో అభిమానులు, సంఘాలు చిరంజీవికి మద్దతుగా నిలిచాయి.

  ప్రజారాజ్యంతో రాజకీయాల వైపు అడుగులు

  ప్రజారాజ్యంతో రాజకీయాల వైపు అడుగులు

  దక్షిణాది అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోల్లో ఒక్కడిగా నిలిచిన చిరంజీవి రాజకీయ రంగం వైపు అడుగులేశాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశాడు. అధికారం చేజిక్కించుకొనేంతగా పార్టీ విజయం సాధించకపోవడం చిరంజీవితో సహ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. పార్టీని నడపడంలో ఇబ్బందులను, అనేక అపవాదులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యాడు.

  అగ్రస్థానాన్ని వదిలి పదేండ్లు రాజకీయాల్లో..

  అగ్రస్థానాన్ని వదిలి పదేండ్లు రాజకీయాల్లో..

  గత పదేండ్లలో రాజకీయాల్లో చిరంజీవి బిజీ అయ్యాడు. దశాబ్దకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోలు సంచలన విజయాలు సాధించారు. యువ హీరోలు భారీ హిట్లు సాధించారు. ఇండస్ట్రీ స్టామినాను పెంచారు. తిరుగులేని కలెక్షన్లను సాధించారు. అయితే వారెవరూ నంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడంలో విఫలమయ్యారు. పదేండ్లపాటు ఖాళీగా ఉన్న అగ్రస్థానాన్ని చిరంజీవే దక్కించుకొన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఖైదీ నంబర్ 150 చిత్రం విజయం, కలెక్షన్లు అదే రుజువు చేశాయని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  పదేండ్ల గ్యాప్ తర్వాత అదే హవా

  పదేండ్ల గ్యాప్ తర్వాత అదే హవా

  మళ్లీ సరిగ్గా 10 ఏండ్ల గ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకొని 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంతో మళ్లీ తెరపై సంచలనం రేపాడు. సిని విమర్శకులు, ట్రేడ్ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా ఊహించని రికార్డులను కొల్లగొట్టాడు. తన కెరీర్‌లోనే కాకుండా ఇతర యువ హీరోలకు తానేమి తక్కువ కాదనే రేంజ్‌లో తక్కువ రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. అది ఇండస్ట్రీలో చిరంజీవి స్టామినాకు అద్దం పట్టింది. గత పదేండ్లలో టాలీవుడ్‌లో హీరోలు టచ్ చేయలేకపోయిన నంబర్ వన్ స్థానం తనదేనని ఓ సవాల్ విసిరాడు.

  ఖైదీ నంబర్ 150 రికార్డుల జోరు

  ఖైదీ నంబర్ 150 రికార్డుల జోరు

  పదేండ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 టాలీవుడ్ కలెక్షన్ల రికార్డులు తిరగరాసింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం
  ఇతర చిత్రాల కలెక్షన్లను తలదన్నేలా వసూళ్లను రాబట్టింది. రూ.150 కోట్ల వసూళ్లతో చిరంజీవి తన సత్తాను చాటాడు. చిత్రానికి ముందు వచ్చిన విమర్శలకు కలెక్షన్లతోనే సమాధానం చెప్పారు. టాలీవుడ్‌లో తనకు ఎదురు, తిరుగులేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

  తగ్గని మ్యాజిక్.. అదే హుషారు..

  తగ్గని మ్యాజిక్.. అదే హుషారు..

  ‘రానునుకున్నారా.. రాలేననుకున్నారా. ఢిల్లీకి పోయాడు డ్యాన్సులకు దూరం అయ్యాడు. హస్తినాపురానికి వెళ్లాడు హాస్యానికి దూరమయ్యాడు. ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు. మాస్‌కు దూరం అయ్యాడనుకుంటున్నారేమో. అదే మాస్, అదే గ్రేస్. అదే హోరు, అదే జోరు, అదే హుషారు'అంటూ ఖైదీ నంబర్ 150 ఆడియోలో చెప్పినట్టుగానే చిరంజీవి తన 150 చిత్రంలో మ్యాజిక్ చేశారు. చిరంజీవి ఎంట్రీపై, మెగాస్టార్ మళ్లీ ఆకట్టుకుంటారా అనే అనుమనాలు పటాపంచలయ్యాయి.

  పవన్, త్రివిక్రమ్‌తొ కలిసి చిరు సినిమా

  పవన్, త్రివిక్రమ్‌తొ కలిసి చిరు సినిమా

  టాలీవుడ్‌లో మెగా పవర్‌ను చాటేందుకు తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి నటించేందుకు అడుగులేస్తున్నాడు. పవన్, చిరులిద్దరూ తెరపైన కనిపిస్తే పరిశ్రమలో సంచలనం కావడం ఖాయమనే వాదన వినిపిస్తున్నది. వీరిద్దరికి తోడుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించడం మరో విశేషం. ఈ చిత్రంతో మెగా బ్రదర్స్ మళ్లీ అధిపత్యం కొనసాగించే అవకాశముంది. పలు వర్గాలుగా విడిపోయిన పరిశ్రమపై పట్టు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.

  English summary
  Chiranjeevi was on number one position in Tollywood before entering the politics. After 10 years in politics he come back with Khaidi number 150. Khaidi no 150 movie gets record collections. That proved chiranjeevi has on alternate in Tollywood.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more