»   » బ్లూఫిలిం కేసులో చిరంజీవి కుట్ర... హీరో సుమన్ క్లారిటీ ఇచ్చాడు.., అప్పటి రహస్యాలన్నీ...

బ్లూఫిలిం కేసులో చిరంజీవి కుట్ర... హీరో సుమన్ క్లారిటీ ఇచ్చాడు.., అప్పటి రహస్యాలన్నీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరడగుల ఎత్తు, హీరో అనే పదానికి అసలైన రూపం. కరాటే లో బ్లాక్ బెల్ట్ ... ఇది క్లుప్తంగా హీరో సుమన్ గురించిన ఇంట్రడక్షన్. కెరీర్ స్టార్టింగ్ లో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ, సుమన్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసే సమయం.. 80వ దశకంలో అప్పుడే స్టార్ హీరో ఇమేజ్ ని దక్కించుకోబోతున్నాడు హీరో సుమన్. అందగాడు డ్యాన్స్ కూడా బాగానే వేయగల సమర్ధుడు కాబట్టి సుమన్ కు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. కాని ఎందుకో అనుకున్నత క్రేజ్ రావడం సరికదా కొన్ని అనివార్య కారణాల వల్ల జైలుకి కూడా వెళ్లాడు సుమన్. సడెన్ గా ఓ అర్థరాత్రి పోలీసులు సుమన్ ఇంటికి వచ్చారు. విచారణ పేరుతో చీకటి గదిలో పడేశారు. దానితో తన కెరీర్ ను లాస్ అవ్వాల్సి వచ్చింది.

Also See : సుమన్‌కు రజనీకాంత్ సలహా: తెరాసలోకి..?

ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం కథనం..ఇప్పుడెందుకు? జైలు గోడల మధ్య హీరో సుమన్ గడిపిన జీవితం ఎందుకు అవసరం? జైలు గోడల మధ్య అతను పడ్డ తపన...నేర్చుకున్న జీవిత సత్యాలు.అతని మనో నిబ్బరం..తను నిర్దోషిని అనే నమ్మకం... ఒక వ్యక్తిత్వ వికాసానికి కావలిసిన అంశాలు.ఒక పాపులర్ నటుడి స్వీయ అనుభవాలు చేదు నిజాలు,నిష్టుర సత్యాలు... ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.

సుమన్ జైలుకు వెళ్లిన విషయం:

సుమన్ జైలుకు వెళ్లిన విషయం:

నీలి చిత్రాల కేసులో ఇరుక్కుని, ఏడాదికి పైగా జైల్లో గడిపి, ఆపై సినిమా అవకాశాలు సన్నిగిల్లి, ద్వితీయ స్థాయి హీరోగా పరిశ్రమలో మిగిలిపోయిన సుమన్,ఒక టీవీచానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక సుమన్ జైలుకు వెళ్లిన విషయంలో ఇప్పటికీ తెలుగు సినీ అభిమానుల్లో ఉన్న అనుమానాన్నే ప్రశ్నగా ఆయన ముందుంచాడు ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్...

 బయటకు రాకూడదని:

బయటకు రాకూడదని:

బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ ను ఇరికించింది చిరంజీవేనని, ఇప్పటికీ ఆ ప్రచారం పెద్దఎత్తున ఉందని, దీనిని మీరు కూడా నమ్ముతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి "గూండాస్ యాక్ట్ వేసిన కారణం ఏంటంటే, వన్ ఇయర్ బెయిల్ లేకుండా, వన్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో శిక్షను అనుభవించాలని, నేను బయటకు రాకూడదని వాళ్లు ట్రై చేశారు" అన్న సుమన్ వ్యాఖ్యలు ఆ టీవీ చానల్ వేస్తున్న ప్రోమోలో కనిపించాయి.

బ్లూ ఫిల్మ్ సినిమాల కేసు:

బ్లూ ఫిల్మ్ సినిమాల కేసు:

తెలుగు చిత్ర సీమలో అప్పట్లో డ్యాన్స్ లకు చిరంజీవి ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో, ఫైట్లకు హీరో సుమన్ అంతే రీతిలో కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. అలా తెలుగు చిత్ర సీమలో ‘సూపర్ హీరో'గా సాగిపోతున్న వేళ... బ్లూ ఫిల్మ్ సినిమాల కేసులో ఇరుక్కుని, ఏడాదికి పైగా జైల్లో గడిపి, ఆపై సినిమా అవకాశాలు సన్నిగిల్లి, ద్వితీయ స్థాయి హీరోగా పరిశ్రమలో మిగిలిపోయిన సుమన్ ను తాజాగా ఓ మీడియా ఛానల్ పలకరించింది.

సుమన్ ను ఇరికించింది చిరంజీవే:

సుమన్ ను ఇరికించింది చిరంజీవే:

ఇంటర్వ్యూలో భాగంగా సుమన్ జైలుకు వెళ్లిన విషయంలో అప్పట్లో టాలీవుడ్ లో హల్చల్ చేసిన విషయాన్నే ప్రశ్నించింది. "బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ ను ఇరికించింది చిరంజీవేనని, ఇప్పటికీ ఆ ప్రచారం పెద్ద ఎత్తున ఉందని, దీనిని మీరు కూడా నమ్ముతున్నారా?" అన్న ప్రశ్న వేయడంతో కార్యక్రమమంతా ఆసక్తికరంగా మారింది.

వన్ ఇయర్ బెయిల్ లేకుండా :

వన్ ఇయర్ బెయిల్ లేకుండా :

కార్యక్రమం మొత్తం లో ఉన్న ఆసక్తి కరమైన ప్రశ్నలతో ఆ ఇంటర్వ్యూ ప్రోమో వదిలారు అలాగే ‘మీ వద్ద ఎంత నల్లధనం ఉంది' అనే వర్తమాన ప్రశ్నలతో కూడిన ప్రోమో ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. అలాగే "గూండాస్ యాక్ట్ వేసిన కారణం ఏంటంటే, వన్ ఇయర్ బెయిల్ లేకుండా ఉంచారనీ,

కావాలనే ఇరికించే కుట్ర జరిగిందని :

కావాలనే ఇరికించే కుట్ర జరిగిందని :

తాను వన్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో శిక్షను అనుభవించాలని, నేను బయటకు రాకూడదని వాళ్లు ట్రై చేశారు" అని సుమన్ చెప్పిన సమాధానాలను కూడా చూపించడంతో... ఇంతకీ ఆ "వాళ్ళు" ఎవరన్న ఆసక్తితో అంతా ఆ కార్యక్రమం కోసం ఎదురు చూసారు. నిజానికి సుమన్ అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా సుమన్ ని కావాలనే ఇరికించే కుట్ర జరిగిందని నమ్ముతూంటారు.

అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు:

అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు:

ఆ రోజుల్లో సుమన్ అంటే అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు . అంత వేగంగా వెళుతున్న సుమన్ కెరీర్ ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. సుమన్ పై పలు ఆరోపణలు మోపుతూ జైలుకు పంపారు దాంతో సుమన్ కెరీర్ నాశనం అయిపొయింది . ఇదంతా కొంతమంది కావాలనే కుట్ర చేసారట ఆ కుట్ర కు చిరంజీవి కి సంబంధం ఉంది అని ఆరోపణలు కూడా వచ్చాయి కానీ ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు హీరో సుమన్ .

చిరంజీవి నాపై కుట్ర చేయలేదని:

చిరంజీవి నాపై కుట్ర చేయలేదని:

ఇంటర్వ్యూ లో చిరు పై ఆరోపణలు చేయడంతో సుమన్ ఆగ్రహంగా ఆ ఆరోపణలు ఖండించాడు . చిరంజీవి నాపై కుట్ర చేయలేదని ,ఆ అవసరం అతడికి లేదని చెప్పాడు . ఆరోజు అసలు ఏం జరిగిందో ఇదివరలో చాలా సార్లే చెప్పినా . వెనక ఏం జరిగిందన్న విశయం ఎప్పుడూ సుమన్ చెప్పలేదు.

కుట్ర పన్ని లేనిపోని ఆరోపణలు:

కుట్ర పన్ని లేనిపోని ఆరోపణలు:

అయితే కొన్ని వాదలనల ప్రకారం తన అరెస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా కారణమని అంటుంటారని, దానికి స్పందిస్తూ తాను జైలు కెళ్లే విషయంలో చిరంజీవి కుట్ర ఏం లేదని తేల్చి చెప్పాడు. కాని ఇండస్ట్రీలో కొంతమంది మాత్రం కావాలనే తనపై అలా కుట్ర పన్ని లేనిపోని ఆరోపణలు మోపి జైలుకి పంపారని చెప్పాడు.

చిరంజీవి ప్రమేయం ఏం లేదని:

చిరంజీవి ప్రమేయం ఏం లేదని:

ఎప్పటినుండో అందరికి తాను ఈ విషయంపై క్లారిటీ ఇవ్వదలచుకున్నానని అసలు తాను జైలు కెళ్లడంలో చిరంజీవి ప్రమేయం ఏం లేదని ఇలాంటివి ఇంకోసారి ఎవరైనా అన్నా తన ఆగ్రహానికి గురవుతారని అన్నాడు. చిరంజీవి ని అన్వసరంగా ఈ విషయం లోకి తేవతం తనకు నచ్చటం లేదన్నట్టుగా చెప్పాడు.

కెరియర్ పరంగా:

కెరియర్ పరంగా:

ప్రస్తుతం కెరియర్ పరంగా సాటిస్ఫైడ్ గా ఉన్న సుమన్ ఎన్నో వైవిధ్యభరితమైన క్యారక్టర్లు చేస్తూ అభిమానులను అలరిస్తుండటం విశేషం. అటు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూనే డివోషనల్ కు సంబంధించిన సినిమాలు చేసే అదృష్టం రావడం గొప్ప విషయం అని చెప్పుకొచ్చారు సుమన్.

 చిరంజీవి కి ఇండస్ట్రీ లో పోటి:

చిరంజీవి కి ఇండస్ట్రీ లో పోటి:

మెగా స్టార్ చిరంజీవి అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో తనకి అంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది . చిరంజీవి కి అప్పట్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు . చిరంజీవి కి ఇండస్ట్రీ లో పోటి ఇంచింది అంటే ఒక బాలకృష్ణ హీరో సుమన్ లే అని చెప్పాలి వాళ్ళిదరు తప్ప చిరంజీవి కి ఇండస్ట్రీ లో పోటి ఇచ్చిన హీరోనే లేదు .

పుట్టిన రోజు సందర్భంగా :

పుట్టిన రోజు సందర్భంగా :

అయితే పోయిన సంవత్సరం కూడా ఇదే టీవీ చానెల్ సుమంతో ఇంటర్వ్యూ కార్యక్రమం నిర్వహించింది. పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దామని ఆ న్యూస్ ఛానల్ హీరో సుమన్ను స్టూడియోకు పిలిచారు. అది రికార్డింగ్ ప్రోగ్రాం.. రికార్డింగ్ స్టార్ట్ అయ్యింది.. యాంకర్ దేవి నాగవళ్లి సుమన్ జీవిత విశేషాలను అడిగింది, దానికి సుమన్ సమాధానం చెప్పాడు. ఇక షో కొనసాగుతున్న తరుణంలో యాంకర్ దేవి సుమన్ ను .. వాస్తవాలు మాట్లాడుకుందాం అంటూ ...

తన కెరీర్ ను కాపాడుకోవడం కోసమే:

తన కెరీర్ ను కాపాడుకోవడం కోసమే:

చిరంజీవి తన కెరీర్ ను కాపాడుకోవడం కోసమే కొన్ని కుట్రలు పన్ని సుమన్ ను జైల్ కు నెట్టించాడని కొన్ని వార్తలు ఎప్పుడూ వినిపిస్తుంటాయ్.ఈ విషయం పై మీరేమంటారు? కెసిఆర్ ను పొగడడం వెనుక రాజకీయ అరంగేట్ర ఉద్దేశ్యం ఉందా? అంటూ మొదలుపెట్టి మరిన్ని ప్రశ్నలు అడగటానికి సిద్దమవుతూండగానే కోపం తో సంయమనం కోల్పోయాడు సుమన్

మీ లిమిట్స్ ను క్రాస్ చేయకండి:

మీ లిమిట్స్ ను క్రాస్ చేయకండి:

అంటూ ప్రశ్నలు అడగగానే దేవి నాగవళ్లి పై హీరో సుమన్ విరుచుకుపడ్డాడు.. ఎమనుకుంటున్నారు మీరు . ఓ పద్దతి ఉంటుంది.. మీ లిమిట్స్ ను క్రాస్ చేయకండి... అంటూ వేలు చూపిస్తూనే , కోపంగా యాంకర్ దేవి నాగవళ్లి వైపు దూసుకెళ్లాడు. అప్పట్లో ఆ వీడియో సంచలనం రేపింది. అయితే సంవత్సరం తిరగ్గానే అదే టీవీ చానల్ లో మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపిక గా సమాధానాలు చెప్పాడు, తనకీ చిరంజీవికీ మధ్య ఏదో ఉందన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసాడు.

English summary
Tollywood Actor Suman in Prasthanam speaks about His Blue Film Controversy which lead him to a Dark Shade and break from Film Industry
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu