For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘గబ్బర్‌ సింగ్‌’‌ రికార్డ్ స్మాష్ అయిపోవాల...!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ఏ రేంజిలో ఎంటర్ టైన్మెంట్ పంచిందో ప్రత్యేకంగా చెక్కర్లదు. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈచిత్రం పవర్ స్టార్ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా పరిశ్రమలోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

  అయితే 'గబ్బర్ సింగ్' రికార్డును స్మాష్ చేసేందుకు వస్తున్నాడు మరో దర్శకుడు. అతనెవరో కాదు క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్. పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'.

  ఈ చిత్రం పూరి కెరీర్లోనే అత్యంత వినోదాత్మక చిత్రంగా నిలుస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి దాకా కామెడీ, యాక్షన్, రొమాంటిక్ ఎలిమెంట్లతో అత్యంత వినోదాత్మకంగా రూపొందుతోందని పూరి సన్నిహితులు అంటున్నారు. ఈ చిత్రం తప్పకుండా గబ్బర్ సింగ్‌ను బీట్ చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడట దర్శకడు. పవన్ అభిమానులు కూడా పూరి చిత్రాన్ని అద్భుతంగా తరకెక్కిస్తారనే నమ్మకంతో ఉన్నారు.

  పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 21న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 11న ఈచిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  As per our sources Puri Jagannath has come up with his career best funny one liners for ‘Cameraman Gangatho Rambabu’ film. In other words Puri has done a Trivikram for this movie as far as the comedy is concerned. There would be some emotional aspect too, which wouldn’t be over the top. High chances are there to fall in love with Rambabu character say sources. If you have doubts over Reporter Rambabu’s comedy in ‘Cameraman Gangatho Rambabu’ please put them to rest and just get ready to fasten your seat belts. Why because CGR is going to be a roller coaster ride for all the Pawan fans as well as entertainment lovers. If you loved Gabbar Singh, then you will love Rambabu even better as he is double entertaining than Gabbar Singh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X