»   » ఆ హీరోయిన్ సినిమాలో వుంటే కళ్ళు మూసుకుని బిజినెస్ అయిపోతుందా..!

ఆ హీరోయిన్ సినిమాలో వుంటే కళ్ళు మూసుకుని బిజినెస్ అయిపోతుందా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ఒకప్పటి ఎవర్ గ్రీన్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇప్పటికీ తానే నెంబర్ వన్ హీరోయిన్ ని అనుకుంటోంది. అందుకే, తన దగ్గరకొచ్చే నిర్మాతలకి కళ్ళు తిరిగే రేటు చెబుతోంది. ఈమధ్య అమెరికా నుంచి వచ్చి, ఓ రియాలిటీ షోలో పాల్గొన్న మాధురీ దీక్షిత్ ని నలుగురైదుగురు నిర్మాతలు కలిసి, తమ సినిమాల్లో నటించమని కోరేటప్పటికి, 5 కోట్లు రెమ్యునేరేషన్ గా అడిగిందట. దాంతో ఏం చెప్పాలో నోట మాట రాక, 'మళ్లీ వస్తాం మేడం' అంటూ ఆ ప్రోడ్యుసర్లు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్దంత మొత్తలో రెమ్యూనరేషన్ కరీనా కపూర్, కత్రినా కైఫ్ మరియు ప్రియాంకా చోప్రాలు మాత్రమే తీసుకొంటున్నారు.

ఈ విషయాన్ని ఆమె మేనేజర్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు, 'అవును..మాధురీకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో చెక్కుచెదరని అభిమానం వుంది. ఆమె మీ సినిమాలో వుంటే కళ్ళు మూసుకుని బిజినెస్ అయిపోతుంది" అంటూ గొప్పలు చెబుతున్నాడు. అయితే, బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు మాత్రం మాధురీకి అంత సీను లేదనీ, తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుని అలా అడుగుతోందనీ అంటున్నారు. 'ఇప్పుడు తను సిస్టర్ పాత్రలకీ, తల్లి పాత్రలకే సూట్ అవుతుంది. అలాంటప్పుడు అంత పారితోషికం ఎవరిస్తారు?" అంటున్నారు నిర్మాతలు. 'ఇప్పటికీ ఎంతో క్రేజ్ వున్న అమితాబ్ బచ్చనే తన రేంజ్ ఏమిటో తెలుసుకుని అడుగుతున్నాడు. షారుక్, అమీర్ లనుమించి అడగడం లేదు. మాధురీ ఇది గమనిచాలి" అంటున్నారు. మరి, మాధురి వాస్తవంలోకి వస్తుందా?

English summary
When we speak about actress Madhuri Dixit, the only thing that strikes our mind is the word 'evergreen'. Even if she is not an active member in B-Town Madhuri still has the power to grab the spot light, news paper headlines, camera focus and hearts of Bollywood Fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu