twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు రూ. 50 లక్షల విరాళమిచ్చారా..?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు ఉత్తరఖండ్ బాధితుల సహాయార్థం సహాయం అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన రూ. 50 లక్షలు ఆర్థిక సహాయం చేసారని, ఈ విషయాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేక రహస్యంగా ఉంచుతున్నారని అంటున్నారు. మరి ఇంత రహస్యంగా ఉంచినా ఈ విషయం ఎలా లీకైందో? ఆయన ఆర్థిక సహాయం చేసారనడంలో నిజం ఎంతో? తేలాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ. 24 లక్షలు ఉత్తరఖండ్ బాధితుల కోసం అందించిన విషయం తెలిసిందే.

    మహేష్ బాబుకు సంపాదన తప్ప మరో యావ ఉండదనే ఓ అపనింద ఎప్పటి నుండో ఉంది. ఆయన సినిమాల షూటింగులు, యాడ్ ఫిల్మ్ షూటింగులు, తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే సంస్థల ప్రచార కార్యక్రమాలకు తప్ప మహేష్ బాబు బయటకు రారు. ఇలాంటి సందర్భాల్లోనే మీడియాకు అప్పుడప్పుడు అరుదుగా కనిపిస్తారు.

    అయితే మహేష్ బాబులో ఇంకో కోణం కూడా ఉంది. అనేక సందర్భాల్లో ఆయన భారీ మొత్తాలను విరాళంగా ఇచ్చారు. త్వరలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ట్రస్టు స్థాపించబోతున్నారు. క్యాన్సర్, గుండె సంబంధ, కాలేయ సంబంధమైన ప్రాణాంతకమైన వ్యాధులతో బాధ పడే పేద పిల్లలకు సహాయ కారిగా ఈ ట్రస్టును స్థాపించబోతున్నారు.

    మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.... ఆయన ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో '1-నేనొక్కడినే' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మహేష్ సినిమాకు ఆయన తొలిసారి పనిచేస్తుండటం విశేషం. ఇప్పటివరకూ సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిని మించేలా అద్భుతమైన సంగీతాన్ని దేవిశ్రీ అందించినట్లు సమాచారం.

    మహేష్‌బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న ఈ చిత్రం పాటలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

    English summary
    Film Nagar dource said that, Mahesh Babu donates 50 lakhs for flood victims. Mahesh wanted to keep this as secret as he prefers no publicity such things.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X