»   »  మురుగదాస్ వల్ల మహేష్ బాబు కి కూడా అదే వ్యతిరేకత వస్తుందా..?? అభిమానులేమంటారు??

మురుగదాస్ వల్ల మహేష్ బాబు కి కూడా అదే వ్యతిరేకత వస్తుందా..?? అభిమానులేమంటారు??

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మూడేళ్ల కిత్రం 'కత్తి' సినిమా కథ రాస్తున్నప్పుడు వీటిని తాగడం మానేశా. ఇప్పుడు నా షూటింగ్‌ స్పాట్‌లో కూడా నిషేధించాం' అంటూ మురుగదాస్ చేసిన ట్వీట్ చూడగానే చాలామందికి ఆయన మీద గౌరవం రెట్టింపయ్యింది. మురుగదాస్‌ దర్శకత్వంలో 'కత్తి' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శీతలపానీయాల తయారీ వల్ల గ్రామాల్లోని నీటి వనరులు కలుషితం అవుతున్న కథాంశాన్ని చర్చించారు.

కథ రాసేటప్పుడే మురుగదాస్ కి అసలు పరిస్థితి అర్థమయ్యిందట ఈ కూల్ డ్రింక్ కంపెనీల వల్ల ఎంత ధారుణంగా భూగర్భజలాలే కాదు ఆ ఫ్యాక్తరీలనుంచి వెలువడే వ్యర్థాల వల్ల బయ్ట ఉండే జలవనరులు కూడా ఎంత ధారుణంగా నాశనం అవుతున్నాయో అర్థ్మయ్యిందట... అంతే "కత్తి" సినిమా మొదలు పెట్టేముందే శీతల పానియాలని వదిలిపెట్టాడట మురుగదాస్.

జల్లికట్టును అడ్డుకుంటున్న పెటా సంస్థను నిషేధించాలని తమిళనాడులో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలకు పలు వ్యాపార సంఘాలు, సినీ పరిశ్రమ ప్రముఖులు, అనేక రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ఇస్తున్నారు. జల్లికట్టు నిర్వహణ కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తూ తమిళనాడులో విదేశీ శీతల పానీయాలైన పెప్సీ, కోకాకోలా విక్రయాలు నిలిపివేస్తున్నామని వ్యాపార సంఘాలు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

 Is mahesh will face the problem Like vijay With Murugadaas Tweet

తమిళ రాష్ట్రంలోని అనేక సినిమా థియేటర్లలో పెప్సీ, కోకాకోలా శీతలపానీయాల విక్రయాలను నిషేధించారు. పెప్సీ, కోకాకోలా స్థానంలో స్వదేశీయంగా తయారు అవుతున్న గోలీ సోడా, కలర్ సోడా, నిమ్మకాయ సోడాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గోలీసోడాకు క్రేజ్ పెరిగిపోతోంది.

ఎలాగైనా మన దేశంలో తయారవుతున్నసోడాలకు ఇప్పుడు భలే గిరాకి వచ్చిందని సినిమా థియేటర్లకు వెలుతున్న సినీ అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని వివిద జిల్లాల్లో గోలీ సోడాల విక్రయాలు ఊపందుకున్నాయి.

రీసెంట్ గా చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150 చిత్రం 'కత్తి' రీమేక్ కావటం విశేషం. ఈ చిత్రం ఇక్కడా ఘన విజయం సాధించింది. ఇక మురగదాస్ ప్రస్తుతం తెలుగు సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది.. అయితే ఇక్కడ చాలామంది వేస్తున్న ప్రశ్న ఒకటే అటు ఈ సినిమా దర్శకుడేమో శీతల పానియాల వ్యతిరేకి , కానీ ఆయన హీరో మాత్రం అతిపెద్ద కూల్డ్రింక్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్.. దర్శకుడు వద్దంటే... హీరో తాగండి అని చెప్తాడు.. అదన్నమాట సంగతి.

 Is mahesh will face the problem Like vijay With Murugadaas Tweet

అయితే ఇక్కడ ఒక కొసమెరుపుంది మరి.. అక్కడ మురుగదాస్ ఆ ట్వీట్ చేయగానే వెంటనే కత్తి హీరో విజయ్ కోక్ బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించే ఫొటోలని పొస్ట్ చేయటం ప్రారంబించారు. నిబద్దత అనేది దర్శకుడికే గానీ హీరోలకి ఉండక్కరలేదా అన్న ఉద్దేశం లో ప్రశ్నలుకూడా వస్తున్నాయి. మరి అదే దర్శకుడు తో కలిసి పని చేస్తున్న మహేష్ కూడా కూల్ డ్రీంక్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. మరి రేపు మహేశ్ కి కూడా ఇదే తరహా వ్యతిరేకత రానుందా..?? లేదంటే మహేష్ "శ్రీమంతుడు" తరహాలో ఆలోచించి అలాంటి కంపెనీకి ప్రచారం చేయటం మానుకుంటాడా..?? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి

అదిసరే గానీ...! అదే "కత్తి" కథని తీసుకున్నప్పుడూ..., దాన్ని సినిమాగా తీసినప్పుడూ... కత్తి లో ఉన్న ఈ "ముఖ్యమైన అంశం" ఎవరినీ కదిలించలేదా..?? లేకుంటే చిరు కూడా గతం లో అదే కూల్ డ్రింక్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆ ఫీలే రాకుండా చేసారో గానీ ఖైదీ నెం 150 లో అసలు రైతుల భూములను లాక్కునేది ఏ కంపెనీ అన్నది అసలు ప్రాముఖ్యం కాదన్నట్టు ఆ విషయమే ఎత్తలేదు...

English summary
Now in Tamilandu Ilaya daLapati Vijay Trolling By AR Murugadas"s Tweet that "I stopped drinking Pepsi or coke since 3 years while I started writing kaththi, Now it's also banned from our shooting spot" is the Same seen repeat in Tollywood with mahesh Babu??
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu