»   » మల్లికా షెరావత్ మత్తులో...హీరోగారి కాంపురం చిత్తు?

మల్లికా షెరావత్ మత్తులో...హీరోగారి కాంపురం చిత్తు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ అందాలు చూస్తే ఎంతటి వారైనా మత్తులో పడి పోవాల్సిందే. గతంలో అమ్మడు చాలా మందిని తన బుట్టలో వేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అదే క్రమంలో ఈసారి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సారి ఏకంగా హాలీవుడ్ యాక్టర్ పేరు వినిపిస్తోంది.

హాలీవుడ్ యాక్టర్ ఆంటోనియో బండెరాస్‌తో మల్లికా షెరావత్ ఎఫైర్ నడుపుతోందని....ఆ కారణంగానే ఆంటోనియా, అతని భార్య మెలనీ గ్రిఫిత్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఇద్దరూ విడిపోయారనే వార్తలు హాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలతో మల్లిక మనసు కాస్త నొచ్చుకుంది.

Is Mallika Sherawat Reason Behind Antonio Banderas Divorce

ఇలాంటి అర్థం పర్థం లేని వార్తలను మీడియా వారు మరింత హైలెట్ చేస్తున్నారంటూ చిర్రుబుర్రులాడుతోంది. తన గురించి ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తేవొద్దని కోరుతోంది. బండెరాస్ ఇటీవలే భార్య గ్రిఫిన్ తో విడాకులు తీసుకోవడానికి మీరే కారణమని మీడియా ప్రశ్నించడంపై మల్లిక పైవిధంగా స్పందించారు. 'లీవ్ మీ ఎలోన్' అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఇలా పుకార్లు వినిపిస్తున్నా.... ఆంటోనియో గురించి మాత్రం మంచి మాటలే చెబుతోంది మల్లిక షెరావత్. అతను చాలా మంచి వాడని, ఎంతో మంచి స్నేహితుడని... తమ మధ్య ఇలాంటి వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కావడం లేదని కొచ్చింది ఈ హాట్ బ్యూటీ.

English summary
Mallika Sherawat is allegedly linked with the Hollywood actor Antonio Banderas and she is held responsible for his split from his wife Melanie Griffith. But, Mallika is not a very happy person, she says don’t pry into my personal life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu